Ruhani Sharma | విరాట్ కోహ్లి మరదలి తెలుగు మూవీ – నిర్ణయాలు..వాటి పర్యవసానాలతో “ఆల్కహాల్”
విరాట్ కోహ్లి మరదలు రుహానీ శర్మ తెలుగులో ప్రయోగాత్మక సినిమా చేసింది. ఆల్కహాల్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ హీరోగా నటించాడు. డైరెక్టర్ త్రివిక్రమ్ సతీమణీ సాయిసౌజన్య ఓ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఎప్పుడు రిలీజ్ కానుందంటే?
Entertainment | Published On Nov 12, 2026, 5.34 pm IST
Ruhani Sharma |చిలసౌ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది విరాట్ కోహ్లి మరదలు రుహానీ శర్మ. చిన్న సినిమాగా రిలీజైన ఈ మూవీ నేషనల్ అవార్డును గెలుచుకుంది. చిలసౌ తర్వాత తెలుగులో హిట్ ది ఫస్ట్ కేస్, డర్టీ హరీ, సైంధవ్‌తో పాటు చాలానే సినిమాలు చేసింది. అవకాశాలకు ఢోకా లేకపోయినా విజయాలు మాత్రం వరించలేదు.
దాంతో టాలీవుడ్‌కు కొంత గ్యాప్ ఇచ్చిన ఈ బ్యూటీ బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలీ అనే పాత్రలో రుహానీ శర్మ నటిస్తోంది. నవంబర్ 20న ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ప్రయోగాత్మక కథాంశంతో కోహ్లి మరదలు చేసిన మరో తెలుగు మూవీ ఆల్కహల్ రిలీజ్ డేట్ కూడా కన్ఫామ్ అయ్యింది.
రిలీజ్ డిలే
అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాకు మెహర్ తేజ్ దర్శకత్వం వహించాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. చాలా రోజుల క్రితమే ఆల్కహల్ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. అనివార్య కారణాల వల్ల రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. ఎట్టకేలకు విడుదల తేదీని మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్ 18న ఆల్కహాల్ థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు.
ప్రయోగాత్మకంగా ..
మానవ ప్రవర్తనలోని విభిన్న కోణాలు, నేర ప్రవృత్తి, మనిషి తీసుకునే నిర్ణయాలు వాటి పర్యవసానాలతో ప్రయోగాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అల్లరి నరేష్, రుహానీ శర్మ పాత్రలు డిఫరెంట్ షేడ్స్‌లో సాగనున్నాయి. ఈ సినిమాలో నిహారిక ఎన్‌ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్, రఘుబాబు, వెంకటేష్ కాకుమాను, కిరీటి దమరాజు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
అనుష్క శర్మకు కజిన్
ఆల్కహాల్ సినిమాకు జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తుండగా, చేతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. విరాట్ కోహ్లి భార్య అనుష్క శర్మకు రుహానీ శర్మ కజిన్ అవుతారు. అనుష్క శర్మ ద్వారా విరాట్‌తో రుహానీ బంధుత్వం ఏర్పడింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Sridhar Babu | రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా జీసీసీలు...
- ●Asha Workers | రేవంత్ రెడ్డి ఆశాల చావు కోరుతున్నాడు..
- ●Sonia Gandhi Autobiography Belonging | 'నేను మీ మనిషినే' అని సోనియా ఇంకా నిరూపించుకోవాలా? 'బిలాంగింగ్' బుక్‌పై సుజాత వేల్పూరి ఎమోషనల్ పోస్ట్!
- ●Massive Fire Accident | ప్లాస్టిక్ కుర్చీల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. ఎలా జరిగిందంటే!
- ●Mahesh Bhagwat | హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్
- ●ICICI Bank | ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కొత్త ఛార్జీలు.. డిసెంబర్ నుంచి బెనిఫిట్స్ కట్..

Sridhar Babu | రాష్ట్ర ఆర్థిక ప్రగతికి చోదక శక్తులుగా జీసీసీలు...

Asha Workers | రేవంత్ రెడ్డి ఆశాల చావు కోరుతున్నాడు..

Sonia Gandhi Autobiography Belonging | 'నేను మీ మనిషినే' అని సోనియా ఇంకా నిరూపించుకోవాలా? 'బిలాంగింగ్' బుక్‌పై సుజాత వేల్పూరి ఎమోషనల్ పోస్ట్!

Massive Fire Accident | ప్లాస్టిక్ కుర్చీల తయారీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం.. ఎలా జరిగిందంటే!






