Ramayana Serial | రామాయణ సీరియల్‌లోని సీతారాముల కాంబినేషన్‌లో బాలీవుడ్ మూవీ – రణబీర్ సినిమాకు పోటీగా రిలీజ్
రామాయణ టీవీ సీరియల్ జోడీ దాదాపు 39 ఏళ్ల విరామం తర్వాత మరోసారి అభిమానుల ముందుకు రాబోతున్నారు. రామానంద్ సాగర్ దర్శకత్వం వహించిన రామాయణ సీరియల్‌లో సీతారాముడి పాత్రల్లో కనిపించారు దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్. తాజాగా వీరిద్దరు కలిసి బాలీవుడ్‌లో ఓ సినిమా చేశారు. నోటీస్ పేరుతో రూపొందిన ఈ మూవీ నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Oct 10, 2026, 6.20 pm IST
Ramayana Serial |రామానంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన రామాయణ టీవీ సీరియల్‌లో సీతారాముడి పాత్రల్లో దీపికా చిఖ్లియా, అరుణ్ గోవిల్ కనిపించారు. 1987లో రిలీజైన ఈ మైథాలజీ టీవీ సీరియల్ పెద్ద హిట్టయ్యింది. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన సీరియల్స్‌లో ఒకటిగా నిలిచింది. లాక్‌డౌన్ టైమ్‌లో దూరదర్శన్ రామాయణను రీ రిలీజ్ చేసింది. తొలిరోజే 77 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. రామాయణ సీరియల్‌తో అరుణ్ గోవిల్, దీపికా స్టార్స్‌గా మారిపోయారు. ఈ సీరియల్‌లో దేశవ్యాప్తంగా ఇద్దరికి మంచి క్రేజ్ ఏర్పడింది.
39 ఏళ్ల తర్వాత...
రామాయణ సీరియల్ తర్వాత దాదాపు 39 ఏళ్ల అనంతరం అరుణ్ గోవిల్, దీపికా చిఖ్లియా కలిసి మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ బాలీవుడ్ మూవీ రూపొందింది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది.
ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌ఫామ్
నోటీస్ పేరుతో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీ ప్రభుత్వ ఓటీటీ ప్లాట్‌పామ్ వేవ్స్‌లో నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాకు ప్రదీప్ గుప్తా దర్శకత్వం వహించారు.
బీజేపీ ఎంపీ...
నోటీస్ మూవీలో అరుణ్ గోవిల్, దీపికా చిఖ్లియా భార్యాభర్తలుగా కనిపించబోతున్నారు. అభివృద్ధి, ఆధునీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థ నారాయణ గుప్తా అనే మధ్యతరగతికి చెందిన వృద్ధుడి ఇంటికి కూల్చేస్తుంది. ఈ కూల్చివేతపై నారాయణ గుప్తా కోర్టును ఆశ్రయిస్తాడు. అక్కడ అతడికి న్యాయం జరిగిందా? కార్పొరేట్ శక్తులను ఎదురించి నారాయణ గుప్తా ఎలాంటి పోరాటం సాగించాడు? అన్నదే ఈ మూవీ కథ.
అరుణ్ గోవిల్ ప్రస్తుతం బీజేపీ ఎంపీగా కొనసాగుతోన్నారు. 2024లో మీరుట్ నుంచి విజయం సాధించారు. దీపికా చిఖ్లియా కూడా బీజీపీ పార్టీలో కొనసాగుతోంది. 1991లో బరోడా నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందింది.
రామాయణకు పోటీగా...
రణబీర్‌కపూర్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న రామాయణ మూవీలో అరుణ్ గోవిల్ దశరథుడిగా కనిపించబోతున్నారు. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నవంబర్ 6న రిలీజ్ కాబోతుంది. రామాయణకు పోటీగా అరుణ్ గోవిల్ నోటీస్ ఓటీటీలో విడుదల కానుండటం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana | సీతగా సాయిపల్లవి ఎలా కనిపిస్తుందో తెలియదు : దీపికా చిఖ్లియా
జులై 25, 2026

Akshara Haasan | శృతి హాసన్ చెల్లెలు హీరోయిన్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్
జులై 17, 2026

Web Series | గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌పై వెబ్‌సిరీస్ – ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్
మార్చి 1, 2026
తాజావార్తలు
- ●KTR | రూ. 3,296 కోట్ల రేడియల్ రోడ్ల కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలి
- ●Venomous Snakes in India | భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన 10 పాములు: వీటిలో ఏవి ఎక్కువ విషపూరితం? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
- ●Komatireddy Venkat Reddy | హలో! ఇడ్లీ తిన్నవా.. మమ్మి డాడీ అంటున్నవా
- ●Road Accident | యాక్టివాను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. యువకుడు మృతి
- ●Dhurandhar 2 | గ్రామీ అవార్డుల రేసులో ధురంధర్ 2 - తొమ్మిది విభాగాల్లో పోటీ
- ●CM Vijay | రాహుల్‌తో లంచ్.. మోదీతో మెట్రో రైడ్.. సీఎం విజయ్ తగ్గేదేలేదు

KTR | రూ. 3,296 కోట్ల రేడియల్ రోడ్ల కుంభకోణంపై సీఎం సమాధానం చెప్పాలి

Venomous Snakes in India | భారత్‌లో అత్యంత ప్రమాదకరమైన 10 పాములు: వీటిలో ఏవి ఎక్కువ విషపూరితం? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు

Komatireddy Venkat Reddy | హలో! ఇడ్లీ తిన్నవా.. మమ్మి డాడీ అంటున్నవా

Road Accident | యాక్టివాను ఢీకొట్టిన గ్యాస్ లారీ.. యువకుడు మృతి



