Akshara Haasan | శృతి హాసన్ చెల్లెలు హీరోయిన్ – డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్
శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ హీరోయిన్‌గా నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఓటీటీలో రిలీజైంది. సిమ్రులాక్రా పేరుతో రూపొందిన ఈ మూవీ వేవ్స్ ఓటీటీలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది అక్షర హాసన్.
Entertainment | Published On Jul 17, 2026, 8.21 pm IST
Akshara Haasan | శృతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్క స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. పదేళ్ల కెరీర్‌లో కేవలం ఐదు సినిమాల్లోనే నటించింది ఈ ముద్దుగుమ్మ. నాలుగేళ్ల క్రితం రిలీజైన అచ్చం మేడమ్ నానమ్ పయిర్పు తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ తీసుకుంది. కనీసం సోషల్ మీడియాలోనే కాదు బయట కూడా అక్షర హాసన్ ఎక్కువగా కనిపించదు.
వేవ్స్ ఓటీటీలో...
సడెన్‌గా అక్షర హాసన్ ఓ సైంటిఫిక్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిమ్యులాక్రా పేరుతో రూపొందిన ఈ మూవీ వేవ్స్ ఓటీటీలో రిలీజైంది. ఈ బాలీవుడ్ మూవీలో అక్షర హాసన్‌తో పాటు సత్యజీత్ దూబే హీరోహీరోయిన్లుగా నటించారు. ఏఐ టెక్నాలజీ వల్ల మనుషుల జీవితాల్లో వచ్చిన మార్పులతో సైంటిఫిక్ థ్రిల్లర్‌గా దర్శకుడు పంకజ్ సావంత్ ఈ సినిమాను తెరకెక్కించారు.
భావిని సేత్, అనీసా భట్, జితేంద్ర రాయ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అశ్విన్ శ్రియాన్ మ్యూజిక్ అందించాడు.
నివి...నయన్....
నివి ఓ మోడ్రన్ అమ్మాయి. గత తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడే ప్రయత్నంలో ఉంటుంది. ఆమెలైఫ్‌లోకి నయన్ ఎంటరవుతాడు. నయన్ పరిచయం నివీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? గతాన్ని డిలీట్ చేసే టెక్నాలజీ వల్ల ఇద్దరి జీవితాలు ఎలా అతలాకుతలం అయ్యాయి అన్నదే ఈ మూవీ కథ.
షమితాబ్‌తో...
ధనుష్, అమితాబ్ బచ్చన్ హీరోలుగా నటించిన షమితాబ్‌తో అక్షర హాసన్ యాక్టింగ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత వివేగం, కడారం కొండన్‌తో పాటు మరో రెండు సినిమాలు చేసింది. ఈ సినిమాల్లో గ్లామర్‌కు హంగులకు దూరంగా డిఫరెంట్ రోల్స్‌లో కనిపించింది. ఫింగర్ టిప్ అనే తమిళ వెబ్‌సిరీస్‌లో ఓ కీలక పాత్రలో కనిపించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana Serial | రామాయణ సీరియల్లోని సీతారాముల కాంబినేషన్లో బాలీవుడ్ మూవీ – రణబీర్ సినిమాకు పోటీగా రిలీజ్
అక్టోబర్ 10, 2026

Katrina Kaif | అలా అయితే ముందుకు వెళ్లలేం.. విమర్శకులకు కత్రినా కైఫ్ కౌంటర్!
అక్టోబర్ 9, 2026

AICWA | నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్
అక్టోబర్ 9, 2026
తాజావార్తలు
- ●Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ - హైపర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ నవ్వించిందా?
- ●Hyderabad Cyber Crime Police | 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడులు: 35 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్.. రూ.88 లక్షలు రికవర్
- ●Delhi CJP Protest | ఢిల్లీని కుదిపేసిన సీజేపీ నిరసన.. దేశ రాజధానిలో అసలేం జరిగింది?
- ●Navaratri Utsavams | తిరుచానూరులో రేపటి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
- ●INDIA bloc protest October 12 | ఢిల్లీ పోలీసుల నిర్బంధకాండపై భగ్గుమన్న విపక్షాలు: అక్టోబర్ 12న ‘ఇండియా’ కూటమి మహా ధర్నా
- ●Rajamouli | శ్రీకృష్ణుడి పాత్రలో డైరెక్టర్ రాజమౌళి - సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయిన మైథాలజీ మూవీ

Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ - హైపర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ నవ్వించిందా?

Hyderabad Cyber Crime Police | 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడులు: 35 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్.. రూ.88 లక్షలు రికవర్

Delhi CJP Protest | ఢిల్లీని కుదిపేసిన సీజేపీ నిరసన.. దేశ రాజధానిలో అసలేం జరిగింది?

Navaratri Utsavams | తిరుచానూరులో రేపటి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు



