త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Pothineni | రైట‌ర్‌గా మారుతున్న రామ్ పోతినేని – హిట్టు కోసం క‌ష్టాలు?

Ram Pothineni | ఆంధ్ర కింగ్ తాలూకాతో ఇటీవలే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు రామ్‌. ఆడియెన్స్ నుంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం హిట్ట‌వ్వ‌లేదు. దాంతో త‌న నెక్స్ట్ సినిమా కోసం రామ్ స్టోరీ రైట‌ర్‌గా మారిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. థ్రిల్లర్ కథను రెడీ చేస్తున్నాడట.

N

Entertainment | Published On Dec 16, 2025, 3.14 pm IST

Ram Pothineni | రైట‌ర్‌గా మారుతున్న రామ్ పోతినేని – హిట్టు కోసం క‌ష్టాలు?

రామ్ పోతినేని

Advertisement

Ram Pothineni |  ఆంధ్ర కింగ్ తాలూకాతో ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) . ఓ స్టార్ హీరోకు అభిమానికి మ‌ధ్య రిలేష‌న్‌తో యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. రామ్ యాక్టింగ్‌తో పాటు డైరెక్ట‌ర్ మ‌హేష్‌బాబు టేకింగ్‌పై క్రిటిక్స్‌తో పాటు ఆడియెన్స్ ప్ర‌శంస‌లు కురిపించారు. కానీ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఈ మూవీ హిట్ట‌వ్వ‌లేదు.
30 కోట్ల‌కుపైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో 20 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు ప‌ది కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను మిగిల్చిన‌ట్లు స‌మాచారం.
ఆంధ్ర కింగ్ తాలూకాలో హీరోగా న‌టిస్తూనే ఇందులో ఓ పాట రాశారు రామ్‌. అంతే కాకుండా సింగ‌ర్‌గా మారి ఓ పాట కూడా పాడారు. ఇండియాలోనే లేకుండా ఓవ‌ర్‌సీస్‌లో సినిమాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేశారు. కానీ అత‌డి క‌ష్టం వృథాగా మారింది.
ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని రామ్ రెమ్యూన‌రేష‌న్ తీసుకోకుండా చేశాడని టాక్. రెమ్యూన‌రేష‌న్ బ‌దులుగా నైజాంతో పాటు గుంటూరు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేశారు. ఒక్కో సినిమాకు ప‌ది కోట్ల‌కుపైగా రెమ్యూన‌రేష‌న్ తీసుకునే రామ్‌కు... ఈ సినిమా ద్వారా ఐదు కోట్ల లోపే ద‌క్కిన‌ట్లు స‌మాచారం.ఆంధ్ర కింగ్ తాలూకా రిజ‌ల్ట్ రామ్‌ను కూడా డిస‌పాయింట్ చేసిన‌ట్లు స‌మాచారం. ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న రామ్ స్టోరీ రైట‌ర్‌గా మారుతున్న‌ట్లు  టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
త‌న నెక్స్ట్ సినిమా కోసం రామ్ స్వ‌యంగా క‌థ‌ను అందించ‌బోతున్నాడ‌ట‌.డిఫ‌రెంట్ పాయింట్‌తో థ్రిల్ల‌ర్ క‌థ‌ను రామ్ సిద్ధం  చేస్తున్నట్లు చెబుతున్నారు. స్క్రిప్ట్ వ‌ర్క్ దాదాపు ఫైన‌ల్ అయ్యింద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని అంటున్నారు.
ఈ సినిమా ప్రొడ‌క్ష‌న్‌లో కూడా రామ్ ఇన్‌వాల్వ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించ‌బోతున్న‌ట్లు టాక్. సొంత సినిమాతో పాటు ఓ హార‌ర్ మూవీకి రామ్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు తెలిసింది. కిషోర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు ఈ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం కానున్న‌ట్లు స‌మాచారం. ఆర్కా మీడియా ప‌తాకంపై బాహుబ‌లి నిర్మాత‌లు ఈ హారర్ మూవీని నిర్మించ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement