త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Andhra King Taluka OTT | థియేట‌ర్ల‌లో రిలీజై నెల కాక‌ముందే ఓటీటీలోకి రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా

Andhra King Taluka OTT | రామ్ పోతినేని హీరోగా న‌టించిన ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. డిసెంబ‌ర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Dec 20, 2025, 2.08 pm IST

Andhra King Taluka OTT | థియేట‌ర్ల‌లో రిలీజై నెల కాక‌ముందే ఓటీటీలోకి  రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా

ఆంధ్ర కింగ్ తాలూకా

Advertisement

Andhra King Taluka OTT | రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి (Ott)వ‌చ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ శ‌నివారం అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యాయి. డిసెంబ‌ర్ 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఆంధ్ర కింగ్ తాలూకా స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
న‌వంబ‌ర్ 27న థియేట‌ర్ల‌లోరిలీజైన ఆంధ్ర కింగ్ తాలూకా నాలుగు వారాలు కూడా గ‌డ‌వ‌క‌ముందే ఓటీటీలోకి రానుండ‌టం టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. థియేట్రిక‌ల్ రిలీజ్‌, ఓటీటీ మ‌ధ్య గ్యాప్ పెంచాలంటూ వార్త‌లు వినిపిస్తున్న త‌రుణంలో రామ్ సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలో రిలీజ్ కాబోతుండ‌టం హాట్ టాపిక్‌గా నిలిచింది. ఆంధ్ర కింగ్ తాలూకా థియేట‌ర్ల‌లో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ రిజ‌ల్ట్ వ‌ల్లే తొంద‌ర‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌...

ఆంధ్ర కింగ్ తాలూకా మూవీకి మ‌హేష్‌బాబు పి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ యాక్ష‌న్ కామెడీ డ్రామా మూవీలో రామ్‌కు జోడీగా భాగ్య‌శ్రీ బోర్సే  (Bhagyashri Borse) హీరోయిన్‌గా న‌టించింది. క‌న్న‌డ సీనియ‌ర్ హీరో ఉపేంద్ర ముఖ్య పాత్ర‌లో క‌నిపించాడు.
హీరోల‌ను అభిమానులు ఎలా అరాధిస్తారు? అవ‌స‌ర‌మైతే వారి కోసం ఎంత దూరం వెళ‌తారు అనే కాన్సెప్ట్‌తో వాస్త‌వ ఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఈ సినిమాను రూపొందించారు. కాన్సెప్ట్ రియ‌లిస్టిక్‌గా ఉన్నా ఆడియెన్స్‌కు మాత్రం సినిమా క‌నెక్ట్ కాలేక‌పోయింది. క‌మ‌ర్షియ‌ల్‌గా ఆంధ్ర కింగ్ తాలూకా ఫెయిల్యూర్‌గా నిలిచింది.
హీరోయిజం, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌కు దూరంగా సాగ‌ర్ అనే కుర్రాడి పాత్ర‌లో రామ్ యాక్టింగ్‌కు మంచి పేరొచ్చింది. ఈ సినిమాలో నువ్వుంటే చాలే అనే పాట‌ను రామ్ రాశాడు. మ‌రో సాంగ్‌ను పాడాడు. ఆంధ్ర కింగ్ తాలూకాతో ఆల్‌రౌండ‌ర్‌గా నిరూపించుకున్న అత‌డికి హిట్టు మాత్రం ద‌క్క‌లేదు.

ఆంధ్ర కింగ్ తాలూకా క‌థ ఇదే...

సాగ‌ర్ తూర్పు గోదావ‌రి జిల్లా లంక గ్రామానికి చెందిన ఓ కుర్రాడు. హీరో సూర్య అంటే సాగ‌ర్‌కు విప‌రీత‌మైన అభిమానం. సూర్య వందో సినిమా క‌ష్టాల్లో ఉంద‌ని తెలిసి మూడు కోట్లు డ‌బ్బు స‌ర్ధుబాటు చేస్తాడు సాగ‌ర్‌. ఆ డ‌బ్బు అత‌డికి ఎందుకొచ్చింది? హీరోపై అభిమానంతో తాను ప్రేమించిన మ‌హాల‌క్ష్మికి సాగ‌ర్‌ ఎందుకు దూరం కావాల‌ని అనుకున్నాడు? సాగ‌ర్‌ను వెతుక్కుంటూ వ‌చ్చిన సూర్య‌కు అత‌డి గురించి ఎలాంటి నిజాలు తెలిశాయి అన్న‌దే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement