Ram Pothineni | పాజిటివ్ టాక్‌తో ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్లాప్ – రామ్ ఖాతాలో మరో డిజాస్టర్
Ram Pothineni | ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరింది. ఈ మూవీ నిర్మాతలకు భారీగానే నష్టాలను మిగిల్చినట్లు చెబుతున్నారు. పాజిటివ్ టాక్‌తో సినిమా ఫ్లాప్ కావడం మేకర్స్‌తో పాటు ట్రేడ్ వర్గాలను షాకింగ్‌కు గురిచేస్తుంది.
Entertainment | Published On Dec 10, 2025, 2.56 pm IST
రామ్ పోతినేని
Ram Pothineni | నెగెటివ్ టాక్‌తో హిట్టయిన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే కనిపిస్తాయి. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఓ సినిమా ఫ్లాప్ కావడం మాత్రం అరుదు. రామ్ (Ram Pothineni)ఆంధ్ర కింగ్ తాలూకా (Andhra King Taluka) ఇందుకు ఎగ్జాంపుల్‌గా నిలిచేలా కనిపిస్తోంది.
నవంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా యునానమస్‌గా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోలకు, అభిమానులకు మధ్య రిలేషన్‌ను నాచురల్‌గా ఆవిష్కరిస్తూ దర్శకుడు మహేష్ బాబు ఈ సినిమాను తెరకెక్కించారు. స్టార్ హీరో అభిమాని పాత్రలో రామ్ నటన, భాగ్యశ్రీ బోర్సేతో అతడి కెమిస్ట్రీ, పాటలు... బాగున్నాయనే కామెంట్స్ వినిపించాయి. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. అభిమానులు మాత్రమే కాకుండా కామన్ ఆడియెన్స్ కూడా సినిమా సూపర్ అంటూ తేల్చేశారు. కానీ ఎటొచ్చి కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు.
రామ్ పోతినేనికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ కారణంగా ఆంధ్ర కింగ్ తాలూకా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ మూవీ రిలీజైంది. పదమూడు రోజుల్లో ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ 16.50 కోట్ల వసూళ్లను మాత్రమే దక్కించుకొని నిరాశపరిచింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఇప్పటివరకు 13 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఓవర్‌సీస్‌లో రామ్, భాగ్యశ్రీ కలిసి గట్టిగానే ఈ సినిమాను ప్రమోట్ చేశారు. అయినా ఓవర్‌సీస్ బాక్సాఫీస్ వద్ద ఆంధ్ర కింగ్ తాలూకా పూర్తిగా తేలిపోయింది. రెండున్నర కోట్లు కూడా రాబట్టలేకపోయింది. ఈ రిజల్ట్ మేకర్స్‌ను షాకింగ్‌కు గురిచేసినట్లు సమాచారం.
రిలీజ్ ముందు తెలుగు రాష్ట్రాల ప్రమోషన్స్‌ను పక్కనపెట్టి మరి రామ్ యూఎస్ వెళ్లాడు. ఆ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్‌పై పడింది. రిస్క్ చేసి ఓవర్‌సీస్‌లో ప్రమోట్ చేస్తే యూఎస్ ఆడియెన్స్ ఈ సినిమాను పట్టించుకోలేదు. దాంతో రెంటికి చెడ్డ రేవడిలా రామ్ పరిస్థితి మారిందని అంటున్నారు.
ఆంధ్ర కింగ్ తాలూకా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకో పది కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టాల్సివుంది. శుక్రవారం అఖండ 2 రిలీజ్ అవుతుంది. ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లు మొత్తం అఖండ 2కే కేటాయించారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టడం అసాధ్యంగా మారింది. ఆంధ్ర కింగ్ తాలూకాతో రామ్ ఖాతాలో మరో డిజాస్టర్ చేరడం ఖాయమైంది. రామ్ గత సినిమాలు స్కంద, వారియర్ కంటే ఆంధ్ర కింగ్ తాలూకాకు తక్కువ కలెక్షన్స్ రావడం కూడా విస్మయపరుస్తోంది. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాను రెమ్యూనరేషన్ తీసుకోకుండా నైజాంతో పాటు గుంటూరు థియేట్రికల్ హక్కులు తీసుకొని రామ్ చేశాడు. అతడికి కూడా ఈ సినిమా నష్టాలనే మిగిల్చింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



