Jailer 2 Collections | 800 కోట్లకు చేరువలో జైలర్ 2 – తెలుగులో రజనీకాంత్ సినిమాకు భారీ లాభాలు
బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 ప్రభంజనం కొనసాగుతోంది. రిలీజై పదహారు రోజులు అయిన రజనీకాంత్ మూవీ కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. వరల్డ్ వైడ్‌గా పదహారు రోజుల్లో 772 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. తెలుగు వెర్షన్ 95 కోట్లతో రికార్డ్ క్రియేట్ చేసింది.
Entertainment | Published On Oct 31, 2026, 5.48 pm IST
Jailer 2 Collections | రజనీకాంత్ (Rajinikanth) జైలర్ 2 బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. రిలీజై పదహారు రోజులు అవుతోన్నకలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు 772 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఎనిమిది వందల కోట్లకు చేరువలో ఉంది. శని, ఆదివారం నాటితో ఈ మైలురాయిని చేరుకోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో లాభల పంట...
జైలర్ 2 (Jailer 2) తెలుగు వెర్షన్ కూడా నిర్మాతకు భారీగా లాభాలను తెచ్చిపెడుతోంది. పదహారు రోజుల్లో తెలుగు వెర్షన్ 95 కోట్ల గ్రాస్, 58.49 కోట్ల షేర్ కలెక్షన్స్‌ను సొంతం చేసుకుంది. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ డబ్బింగ్ మూవీ నిర్మాతకు ఇప్పటివరకు పదహారు కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టింది. తెలుగులో ఈ వీకెండ్‌తో వంద కోట్ల క్లబ్‌లోకి జైలర్ 2 అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ డబ్బింగ్ మూవీగా జైలర్ 2 రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో రజనీకాంత్ సినిమాను నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశారు. వరల్డ్ వైడ్‌గా 302 కోట్ల వరకు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటివరకు నిర్మాతలకు 66 కోట్లకుపైగా లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి.
నెల్సన్ డైరెక్టర్...
జైలర్ మూవీకి కొనసాగింపుగా రూపొందిన ఈ సీక్వెల్‌కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. విద్యాబాలన్, ఎస్‌జే సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు విలన్లుగా కనిపించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌రోషన్‌తో పాటు శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్ చేశారు. ముత్తువేల్ పాండియన్ పాత్రలో రజనీకాంత్ హీరోయిజం, ఎలివేషన్లు, ఆయన మ్యానరిజమ్స్‌తో పాటు గెస్ట్ రోల్స్, నెల్సన్ టేకింగ్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి. జైలర్ 2కు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. జైలర్ 2కు కొనసాగింపుగా జైలర్ 3 కూడా రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhadrachalam | భద్రాచలం వద్ద నవంబర్ 7 వరకు గోదావరి బ్రిడ్జి మూసివేత
- ●Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల
- ●HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!
- ●Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్‌లో విశేష పర్వదినాలు ఇవే..
- ●INDIA Bloc Public Impeachment | సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన': 13.2 కోట్ల ఓట్ల తొలగింపు సహా 6 తీవ్ర ఆరోపణలు చేసిన ఖర్గే!
- ●Etala Rajendar | చరిత్ర చెప్పుకుంటేనే తెలుస్తది

Bhadrachalam | భద్రాచలం వద్ద నవంబర్ 7 వరకు గోదావరి బ్రిడ్జి మూసివేత

Tummala Nageshwar Rao | తెలంగాణలో క్రాప్ హాలిడే ప్రకటించలేదు : మంత్రి తుమ్మల

HRA Tax Exemption | తల్లిదండ్రుల ఇంట్లో ఉంటున్నారా? వారికి అద్దె చెల్లించి పన్ను ఆదా చేసుకోవచ్చు!

Tirumala | తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నవంబర్‌లో విశేష పర్వదినాలు ఇవే..






