CM Revanth Reddy | నీటి సంరక్షణను బాధ్యతగా స్వీకరించాలి
CM Revanth Reddy | నీటి సంరక్షణను సbష్టి బాధ్యతగా స్వీకరించాలని, సుస్థిరమైన, నీటి భద్రత కలిగిన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరం నిరంతరం విస్తరిస్తున్న నేపథ్యంలో నీటి భద్రతకు, విలువైన జల వనరుల సుస్థిర నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
- ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ ఆవిర్భావ దినోత్సవం
- ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం
CM Revanth Reddy | నీటి సంరక్షణను సbష్టి బాధ్యతగా స్వీకరించాలని, సుస్థిరమైన, నీటి భద్రత కలిగిన హైదరాబాద్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నగరం నిరంతరం విస్తరిస్తున్న నేపథ్యంలో నీటి భద్రతకు, విలువైన జల వనరుల సుస్థిర నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం, మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మంచినీటి వనరులను పరిరక్షించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. గృహావసరాలకు సంబంధం లేని ఇతర అవసరాల కోసం మంచినీటి వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోర్డు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. గత 37 ఏళ్లుగా హైదరాబాద్ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంతో పాటు మురుగునీటి నిర్వహణ సేవలు కల్పించడంలో బోర్డు కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. నగర అభివృద్ధి, ప్రజారోగ్యం, సమగ్ర ప్రగతికి బోర్డు అందించిన సేవలను అభినందించారు.
శుద్ధి చేసిన నీటిని వినియోగించాలి
సుస్థిర నీటి నిర్వహణలో భాగంగా ప్రారంభించిన 'డయల్ గ్రీన్ ట్యాంకర్ – గ్రీన్ ట్యాంకర్ ఆపరేషన్స్' కార్యక్రమాన్ని సీఎం అభినందించారు. సరైన సమయంలో చేపట్టిన కీలక కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రభుత్వ శాఖలు, పరిశ్రమలు, నిర్మాణ సంస్థలు, వాణిజ్య సంస్థలు తమ తోటల పెంపకం, నిర్మాణ పనులు, పారిశ్రామిక అవసరాల కోసం శుద్ధి చేసిన మురుగునీటిని (ట్రీటెడ్ వేస్ట్‌వాటర్) విస్తృతంగా వినియోగించాలని కోరారు. దీనివల్ల మంచినీటిపై ఆధారపడటం తగ్గుతుందని, అత్యవసర గృహావసరాలకు తాగునీరు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ తన ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. నీటి వనరుల పరిరక్షణ, పొదుపు, పునర్వినియోగం దిశగా ప్రభుత్వంతో పాటు ప్రజలు, పారిశ్రామిక, వాణిజ్య సంస్థలు సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నీటి భద్రత కలిగిన హైదరాబాద్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HMWSSB | హైదరాబాదీలకు అలెర్ట్.. 36 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్
- ●Centre Tax Devolution to States | తెలంగాణకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. భారీగా నిధులు విడుదల
- ●Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళనపై రాహుల్ గాంధీ కౌంటర్
- ●JP Nadda | ప్రజాస్వామ్యం ముసుగులో దేశంలో అరాచకం సృష్టించే కుట్ర
- ●Sobhita Dhulipala | సంక్రాంతి రేసులో అక్కినేని కోడలి తమిళ మూవీ - టాలీవుడ్ హీరోలతో పోటీ...
- ●INDIA bloc march | ఇండీ కూటమి మెగా మార్చ్.. ఓపెన్ టాప్ వాహనంలో ప్రయాణించిన నేతలు

HMWSSB | హైదరాబాదీలకు అలెర్ట్.. 36 గంటలు ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు బ్రేక్

Centre Tax Devolution to States | తెలంగాణకు కేంద్రం దీపావళి గిఫ్ట్.. భారీగా నిధులు విడుదల

Rahul Gandhi | బీజేపీయే దుకాణాలను బలవంతంగా మూయించింది.. వ్యాపారుల ఆందోళనపై రాహుల్ గాంధీ కౌంటర్

JP Nadda | ప్రజాస్వామ్యం ముసుగులో దేశంలో అరాచకం సృష్టించే కుట్ర




