త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Thrigun | రా అండ్ ర‌స్టిక్ లుక్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ – “జంగా” ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌

బిగ్‌బాస్ సీజ‌న్ 10లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా త‌న ఆట‌తీరుతో అద‌ర‌గొడుతోన్నాడు త్రిగుణ్‌. అత‌డు ఫైన‌ల్‌లో అడుగుపెట్టే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా త్రిగుణ్ హీరోగా తెలుగులో జంగా పేరుతో ల‌వ్ యాక్ష‌న్ మూవీ రూపొందింది. ఈ సినిమా నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On Oct 31, 2026, 5.14 pm IST

Bigg Boss Thrigun | రా అండ్ ర‌స్టిక్ లుక్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్ – “జంగా” ఫ‌స్ట్‌లుక్ రిలీజ్‌
Advertisement

Bigg Boss Thrigun | ప్ర‌స్తుతం స్టార్ మాతో పాటు జియో హాట్‌స్టార్‌లో టెలికాస్ట్ అవుతోన్న బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 10లో (Bigg Boss 10 Telugu) కంటెస్టెంట్‌గా కొన‌సాగుతోన్నాడు త్రిగుణ్‌. టాస్కుల్లో ఆద‌ర‌గొడుతోన్నాడు. డామినేటింగ్, అటాకింగ్ ఆట‌తీరుతో ప్ర‌స్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పేరుతెచ్చుకున్నాడు త్రిగుణ్‌ (Thrigun). ఎనిమిదో వారంలో బిగ్‌బాస్ హౌజ్ కెప్టెన్‌గా కూడా మారాడు. త్రిగుణ్ ఫైన‌ల్ చేరే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది.

జంగా ఫ‌స్ట్‌లుక్‌...

కాగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌క‌ముందు జంగా పేరుతో త్రిగుణ్ ఓ తెలుగు సినిమా చేశాడు. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ నుంచి శ‌నివారం అత‌డి ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో రా అండ్ ర‌స్టిక్‌గా ఈ బిగ్‌బాస్ కంటెస్టెంట్ క‌నిపిస్తున్నాడు.

శివ‌...

జంగాలో శివ అనే పాత్ర‌లో త్రిగుణ్ క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. యాక్ష‌న్‌, భావోద్వేగాల‌తో ముడిప‌డిన ల‌వ్ రొమాంటిక్ థ్రిల్ల‌ర్‌గా జంగా తెర‌కెక్కుతోన్న‌ట్లు పేర్కొన్నారు. నేహాప‌ఠాన్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, శ్రావ‌ణ్‌, మ‌ధునంద‌న్, గ‌గ‌న్ విహారి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుతున్నారు. బిగ్‌బాస్‌తో త్రిగుణ్‌కు వ‌చ్చిన క్రేజ్ జంగాకు హెల్ప‌వుతుంద‌ని మేక‌ర్స్ భావిస్తోన్నారు. కృష్ణ సౌర‌భ్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన మ‌ర‌న్ని అప్‌డేట్స్‌ను త్వ‌ర‌లో రివీల్ చేస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

 

ట్యాగ్స్:

Bigg Boss 10 TeluguBigg Boss ThrigunHero ThrigunJangaa First LookJangaa MovieNeha PatanTollywoodVaralakshmi Sarath Kumar
Advertisement
Advertisement