Regina Cassandra | రెజీనా అనూహ్య నిర్ణయం.. ఎన్జీవోకు గుడ్‌బై..!
Regina Cassandra | ప్రముఖ నటి రెజీనా కసాండ్రా కీలక నిర్ణయం తీసుకున్నది. తాను సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్న 'డెమోక్రటిక్ సంఘ' స్వచ్ఛంద సంస్థ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇకపై సంస్థతో తనకు ఎలాంటి అనుబంధం ఉండదని స్పష్టం చేసింది.
Entertainment | Published On Oct 31, 2026, 8.30 pm IST
Regina Cassandra | ప్రముఖ నటి రెజీనా కసాండ్రా కీలక నిర్ణయం తీసుకున్నది. తాను సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్న 'డెమోక్రటిక్ సంఘ' స్వచ్ఛంద సంస్థ నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. ఇకపై సంస్థతో తనకు ఎలాంటి అనుబంధం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ నిర్ణయానికి గల నిర్దిష్ట కారణాలను మాత్రం వెల్లడించలేదు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేంద్రంగా దీప్తి ఆలపాటితో కలిసి రెజీనా ఈ ఎన్జీవోను ప్రారంభించింది. సంస్థ ప్రారంభం నుంచి కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆమె.. ఇప్పుడు సహ వ్యవస్థాపకురాలిగానే కాకుండా సభ్యురాలిగా కూడా తప్పుకుంటున్నట్లు తెలిపింది. వ్యక్తిగత ప్రాధాన్యతలు, భవిష్యత్తు ప్రయాణంపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది.
రెజీనా ఏమన్నదంటే..
సుదీర్ఘ ఆలోచన, ఆత్మపరిశీలన తర్వాత డెమోక్రటిక్ సంఘ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు రెజీనా వెల్లడించింది. సంస్థతో తనకున్న అనుబంధం జీవితంలో ఎంతో విలువైనదని పేర్కొంది. ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, ఏర్పడిన స్నేహాలు, మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ తనతోనే ఉంటాయని తెలిపింది. సంస్థ ఆశయాల కోసం పనిచేసే అవకాశం లభించడం గర్వంగా భావిస్తున్నానని, అయితే జీవితంలో మరో దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. తనకు అండగా నిలిచిన సహచరులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపింది. వారితో ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పింది. డెమోక్రటిక్ సంఘ భవిష్యత్తు బాగుండాలని, సంస్థతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని ఆకాంక్షించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Cyclone Threat | బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ చిత్రాల్లో స్పష్టంగా గుర్తింపు..
అక్టోబర్ 31, 2026

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు నవంబర్ 3, 4 తేదీల్లో లాటరీ : హౌసింగ్ బోర్డు చైర్మన్
అక్టోబర్ 31, 2026

SIR | ఆ ఓట్లను తొలగించకూడదా? కాంగ్రెస్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్నలు
అక్టోబర్ 31, 2026
తాజావార్తలు
- ●Latur Courier Parcel Blast | కొరియర్ ఆఫీస్ ఎదుట పార్శిల్ బ్లాస్ట్: అన్లోడ్ చేస్తుండగా పేలుడు.. ఉద్యోగికి తీవ్ర గాయాలు
- ●Akka Web Series Review | అక్క వెబ్ సిరీస్ రివ్యూ - హీరో పాత్ర లేకుండా కథ - లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేష్ - విలన్‌గా రాధిక ఆప్టే!
- ●Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు నవంబర్ 3, 4 తేదీల్లో లాటరీ : హౌసింగ్ బోర్డు చైర్మన్
- ●Harish Rao | కేసీఆర్ అంటే నమ్మకం.. రేవంత్ అంటే అమ్మకం
- ●Omar Abdullah Nidhi Razdan Marriage | మూడుముళ్ల బంధంతో ఒక్కటైన జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, జర్నలిస్ట్ నిధి రజ్దాన్
- ●SIR | ఆ ఓట్లను తొలగించకూడదా? కాంగ్రెస్‌కు బండి సంజయ్ సూటి ప్రశ్నలు

Latur Courier Parcel Blast | కొరియర్ ఆఫీస్ ఎదుట పార్శిల్ బ్లాస్ట్: అన్లోడ్ చేస్తుండగా పేలుడు.. ఉద్యోగికి తీవ్ర గాయాలు

Akka Web Series Review | అక్క వెబ్ సిరీస్ రివ్యూ - హీరో పాత్ర లేకుండా కథ - లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేష్ - విలన్‌గా రాధిక ఆప్టే!

Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు నవంబర్ 3, 4 తేదీల్లో లాటరీ : హౌసింగ్ బోర్డు చైర్మన్

Harish Rao | కేసీఆర్ అంటే నమ్మకం.. రేవంత్ అంటే అమ్మకం



