Ramcharan | పుకార్లకు పుల్‌స్టాప్ – రామ్‌చరణ్ , సుకుమార్ మూవీ జానర్ ఇదే – రిలీజ్ ఎప్పుడంటే?
పెద్ది తర్వాత డైరెక్టర్ సుకుమార్‌తో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ప్రయోగాత్మకంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని ప్రచారం జరుగుతోంది. రెండు పార్ట్‌లుగా సుకుమార్ ఈ సినిమాను రూపొందించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రూమర్లలో నిజమెంత అంటే?
Entertainment | Published On Jul 19, 2026, 6.12 pm IST
Ramcharan | ఇటీవలే పెద్ది మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కమర్షియల్‌గా నిరాశపరిచిన యాక్టర్‌గా మాత్రం రామ్‌చరణ్ నటనపై ప్రశంసల వర్షం కురిసింది. క్రాస్ ఓవర్ అథ్లెట్ పాత్రకు మెగా హీరో ప్రాణప్రతిష్ట చేశాడంటూ ఫ్యాన్స్‌తో పాటు క్రిటిక్స్ నుంచి కామెంట్లు వచ్చాయి.
ఆర్‌సీ 17
పెద్ది తర్వాత స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో రామ్‌చరణ్ ఓ సినిమా చేయబోతున్నాడు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తోన్న ఈ పదిహేడవ సినిమాకు ఆర్‌సీ 17 అనే వర్కింగ్ టైటిల్‌ను అనుకుంటున్నారు. రంగస్థలం తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్నంటాయి. కథ, పాత్రల పరంగా ఈ సినిమాతో వీరిద్దరు ప్రయోగాలు చేయబోతున్నారని, చరణ్, సుకుమార్ కెరీర్‌లోనే డిఫరెంట్ జానర్‌లో ఈ సినిమా ఉండబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రెండు పార్ట్‌లతో ఆర్‌సీ 17 తెరకెక్కనుందని అంటున్నారు.
స్టైలిష్ యాక్షన్ మూవీ...
అయితే ఈ రూమర్లలో నిజం లేదట. ప్రయోగాలను పక్కనపెట్టి స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. సెప్టెంబర్‌లో పూజా కార్యక్రమాలతో ఆర్‌సీ 17 లాంఛ్ కాబోతుంది. నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వచ్చే ఏడాది చివరలో లేదంటే 2028 వేసవిలో రామ్‌చరణ్, సుకుమార్ మూవీ రిలీజయ్యే అవకాశం ఉందని సమాచారం.
ఒకే పార్ట్...
ఆర్‌సీ 17 రెండు పార్ట్‌లుగా తెరకెక్కబోతుందంటూ జరుగుతోన్న ప్రచారం కూడా అబద్దమేనని తెలిసింది. కేవలం ఒకే పార్ట్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. సుకుమార్ మార్కు స్క్రీన్‌ప్లేతో డిఫరెంట్‌గా ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుందని టాక్. ఇందులో రామ్‌చరణ్ పాత్ర చాలా స్టైలిష్‌గా సాగుతుందని అంటున్నారు. ఈ సినిమా కోసం స్పెషల్‌గా మేకోవర్ కాబోతున్నారు. ముఖ్యంగా చరణ్‌పై వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఉంటాయని చెబుతున్నారు.. ప్రస్తుతం రామ్‌చరణ్, సుకుమార్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా శనివారం ప్రకటించిన నేషనల్ అవార్డుల్లో పుష్ప 2 సినిమాకుగాను బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌గా సుకుమార్ పురస్కారం దక్కింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Venkatesh | విక్టరీ వెంకటేష్ ఆకలిదేవుడు – అనౌన్స్‌మెంట్ తర్వాత ఆగిపోయిన భారీ బడ్జెట్ మూవీ – డైరెక్టర్ ఎవరంటే?
ఆగస్టు 13, 2026

Megha Akash | ఒకే సారి ఓటీటీలోకి వచ్చిన మేఘా ఆకాష్ రెండు తెలుగు సినిమాలు
ఆగస్టు 13, 2026

Sukumar Daughter | డైరెక్టర్ సుకుమార్ కూతురికి అంతర్జాతీయ అవార్డ్ – ఈ సారి సింగర్‌గా!
ఆగస్టు 13, 2026
తాజావార్తలు
- ●KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!
- ●CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం
- ●CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి
- ●CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్
- ●Hyderabad Police Vehicle Auction | పోలీసులు సీజ్ చేసిన 2,193 వాహనాల వేలం.. వాటిలో మీ బైక్ లేదా కారు ఉందా?
- ●CM Revanth Reddy | అరికెపూడి గాంధీ నా జోలికి వస్తలేడు : సీఎం రేవంత్ రెడ్డి

KBR Park One Way Traffic | కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే ట్రాఫిక్.. గచ్చిబౌలిలో ఫ్లైఓవర్లు: హైదరాబాద్ 'H-CITI' ప్రాజెక్టు అప్డేట్స్ ఇవే!

CM Revanth Reddy | 22 ఏలో ప్రభుత్వ భూములు లేకుంటే నిషేధం ఎత్తేస్తాం

CM Revanth Reddy | అబద్ధాల సంఘాలకు కోట్ల రూపాయాలు ఖర్చు : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | దేవుడే వానలు కురిపించిండు.. అఘోర పూజలపై సీఎం రేవంత్ కామెంట్స్



