Ram Charan | పెద్ది ప్రమోషన్స్‌లో చేతికి బ్యాండేజ్‌తో రామ్ చరణ్ – మెగా ఫ్యాన్స్‌లో టెన్షన్
రామ్ చరణ్ పెద్ది మూవీ జూన్ 4న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రామ్‌చరణ్ ముంబై వెళ్లాడు. ముంబై ప్రమోషన్స్‌లో చరణ్ చేతికి బ్యాండేజ్‌తో కనిపించడంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Entertainment | Published On May 15, 2026, 8.25 pm IST
Ram Charan | పెద్ది ప్రమోషన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ బిజీగా ఉన్నాడు. స్పోర్ట్స్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ మూవీ జూన్ 4న థియేటర్లలోకి రాబోతుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వహించిన ఈ మూవీ పాన్ ఇండియన్ లెవెల్‌లో ఐదు భాషల్లో రిలీజ్ కాబోతుంది.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్...
పెద్ది మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ భారీగానే ప్లాన్ చేశారు. ముంబై, భోపాల్, బెంగళూరుతో పలు ప్రధాన నగరాల్లో ఈవెంట్లను నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. మే 18న పెద్ది ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరుగనుంది. ఈ వేడుకలో ఆస్కార్ విన్నర్, పెద్ది మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చేతికి బ్యాండేజ్‌తో...
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు ముందు బాలీవుడ్‌లోని కొన్ని మీడియా సంస్థలకు రామ్ చరణ్ ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడట. వీటి కోసం రెండు రోజుల ముందే చరణ్ ముంబై చేరుకున్నాడు. ముంబై బంద్రాలోని హెయిర్ స్టైలిష్ట్ హకీబ్ అలీమ్ సెలూన్‌ను రామ్ చరణ్ సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ వీడియోలలో రామ్‌చరణ్ చేతికి బ్యాండేజ్‌తో కనిపించడం ఆసక్తికరంగా మారింది. చరణ్ చేతికి ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మోచేతి వరకు ఆ బ్యాండేజ్ ఉండటంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వరుస ప్రమాదాలు...
గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ హీరోలందరూ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడం లేదంటే ప్రమాదాల బారిన పడటం జరుగుతోంది. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సర్జరీ జరిగింది. పెద్ది షూటింగ్‌లో చరణ్ కన్నుకు దెబ్బ తగిలింది. మరో మెగా హీరో వరుణ్ తేజ్ బరి షూటింగ్‌లో గాయపడ్డారు. ఈ వరుస ప్రమాదాలతో మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



