త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Trailer | గుడిలో కాదు గ్రౌండ్‌లో దేవుడు – క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌గా రామ్‌చ‌ర‌ణ్ – పెద్ది ట్రైల‌ర్ రిలీజ్‌

రామ్‌చ‌ర‌ణ్ పెద్ది ట్రైల‌ర్ వ‌చ్చేసింది. యాక్ష‌న్‌, స్పోర్ట్స్ అంశాల‌తో విజువ‌ల్ ఫీస్ట్‌లా ఈ ట్రైల‌ర్ సాగింది. క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్ గా రామ్‌చ‌ర‌ణ్ రా అండ్ ర‌స్టిక్ రోల్‌లో అద‌ర‌గొట్టేశారు. పెద్ది ట్రైల‌ర్ ట్రెండింగ్‌లో ఉంది.

N

Entertainment | Published On May 18, 2026, 5.02 pm IST

Peddi Trailer | గుడిలో కాదు గ్రౌండ్‌లో దేవుడు – క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌గా రామ్‌చ‌ర‌ణ్ – పెద్ది ట్రైల‌ర్ రిలీజ్‌
Advertisement

Peddi Trailer |  మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ ల‌వ‌ర్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న పెద్ది ట్రైల‌ర్ వ‌చ్చేసింది. మూడు నిమిషాల ఏడు సెకండ్ల నిడివితో కూడిన ఈ ట్రైల‌ర్ కంప్లీట్ విజువ‌ల్ ఫీస్ట్‌లా సాగింది. యాక్ష‌న్‌, స్పోర్ట్స్‌, ల‌వ్ స్టోరీ, రొమాన్స్‌..అన్ని ఎమోష‌న్స్‌తో ఆక‌ట్టుకుంది. క్రికెట‌ర్‌, రెజ్ల‌ర్‌, ర‌న్న‌ర్ గా రామ్‌చ‌ర‌ణ్ ఈ ట్రైల‌ర్‌లో క‌నిపించారు. క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌గా రామ్‌చ‌ర‌ణ్ మేకోవ‌ర్‌, ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ అదిరిపోయాయి.

గ్రౌండ్‌లో దేవుడు...

"ఇక్క‌డ ఏ కుర్రాడిని అడిగిన ఫేవ‌రేట్ ఆట‌ మారుతుంది కానీ ప్లేయ‌ర్ మాత్రం మార‌డం లేదు. పెద్ది ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా" అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా మొద‌లైంది. "ఈ కుర్రాళ్ల‌కు పెద్ది గుడిలో దేవుడు కాదు...గ్రౌండ్‌లో దేవుడు" అంటూ రామ్‌చ‌ర‌ణ్ పాత్ర‌కు  ఎలివేష‌న్ ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటుంది. ఆటే నా పొగ‌రు అంటూ రామ్‌చ‌ర‌ణ్ చెప్పిన డైలాగ్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

మాసీగా...

రామ్‌చ‌ర‌ణ్ జాన్వీ ల‌వ్‌స్టోరీని మాసీగా చూపించారు. "నాను పెద్ది సారు..గెలుపైనా ఓట‌మైనా ఈ కొండ‌కింది ఊరోడిదే అవ్వాలా...మీరు అంద‌రూ నేను ఆడాన‌ని అనుకుంటున్నాను. నేను పోరాడాను" అంటూ రామ్‌చ‌ర‌ణ్ చెప్పిన ఎమోష‌న‌ల్ డైలాగ్స్ ట్రైల‌ర్‌లో మెప్పించాయి. త‌మ ఊరితో పాటు జాతివాళ్ల అస్తిత్వం కోసం పెద్ది అనే యువ‌కుడి సాగించిన పోరాటంతో బుచ్చిబాబు సానా పెద్ది మూవీని తెర‌కెక్కించిన‌ట్లు క‌నిపిస్తోంది. ఉత్త‌రాంధ్ర యాస‌లో వ‌చ్చే డైలాగ్స్‌, రా అండ్ ర‌స్టిక్ విజువ‌ల్స్ ట్రైల‌ర్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.ట్రైల‌ర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు శివ‌రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు కొత్త లుక్‌ల‌లో క‌నిపించారు. ఈ ట్రైల‌ర్ రిలీజైన కొద్ది క్ష‌ణాల్లోనే ట్రెండింగ్ అవుతోంది.

పెద్ది మూవీకిలో ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ జూన్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Advertisement
Advertisement