Peddi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి పెద్ది – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
రామ్‌చరణ్ పెద్ది మూవీ థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలోకి రాబోతుంది. జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు.
Entertainment | Published On Jul 4, 2026, 12.43 pm IST
Peddi OTT | రామ్‌చరణ్ పెద్ది మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడైంది. థియేటర్లలో ఆడుతుండగానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.
ఈ ఏడాది తెలుగులో మోస్ట్ హైప్‌డ్ సినిమాల్లో ఒకటిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ది మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. నిజాయితీతో కూడిన మంచి ప్రయత్నంగా పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది.
నెట్‌ఫ్లిక్స్‌లో...
తాజాగా థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత పెద్ది ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ శనివారం కన్ఫామ్ అయ్యాయి. జూలై 9న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు మరో నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
వేరియేషన్స్...
పెద్ది సినిమాలో క్రాస్ ఓవర్ అథ్లెట్ పాత్రలో అసమాన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు రామ్‌చరణ్. రెజ్లర్, క్రికెటర్‌తో పాటు పారా అథ్లెట్‌గా రామ్‌చరణ్ చూపించిన వేరియేషన్స్, పాత్ర కోసం ట్రాన్స్‌ఫర్మ్ అయిన తీరు, డ్యాన్స్‌లు అభిమానులను ఆకట్టుకున్నాయి. స్టోరీ రొటీన్ కావడం, జాన్వీ పాత్రకు ఇంపార్టెన్స్ లేకపోవడంపై విమర్శలు వచ్చాయి.
కలెక్షన్స్ ఎంతంటే?
వరల్డ్ వైడ్‌గా 220 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ మూవీ 200 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్ ఖాతాలో పెద్దితో మరో ఫ్లాప్ చేరింది. కాగా ఇప్పటికీ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ఆడుతోంది.
ఆస్కార్ విన్నర్..
పెద్ది సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. జగపతిబాబు, శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?
- ●Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!
- ●Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే
- ●Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ
- ●Vemula Prashanth Reddy | ఆర్భాటాలకు వందల కోట్లు.. భీమ్‌గల్ అభివృద్ధికి రూ.20 కోట్లు లేవా?
- ●Tamannaah Bhatia | ‘నో కిస్సింగ్ పాలసీ’కి గుడ్‌బై.. తమన్నా ఎందుకిలా?

Yash | టాక్సిక్ మూవీ పిల్లలు చూడొచ్చా..? హీరో యశ్ ఏమన్నాడంటే..?

Telangana Movie Ticket Prices | సినిమా టికెట్ ధరలపై తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. ఏసీ, నాన్-ఏసీ థియేటర్లలో కొత్త రేట్లు ఇవే!

Konda Surekha TPCC Notice | కొండా సురేఖకు టీపీసీసీ బిగ్ షాక్.. కూతురు కామెంట్స్‌పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందే

Telangana Intermediate Board Scandal | ఇంటర్ బోర్డులో ప్రకంపనలు: గ్లోబరీనా స్కామ్‌పై విజిలెన్స్ ఎంక్వైరీ.. మాజీ సెక్రటరీ అశోక్ విచారణ





