ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్ – రామ్ చరణ్ పెద్ది షూటింగ్ క్యాన్సిల్
Entertainment | Published On Dec 7, 2025, 9.31 am IST
పెద్ది మూవీలో రామ్ చరణ్
ఇండిగో సంక్షోభం ఎఫెక్ట్ సినిమా ఇండస్ట్రీపై కూడా పడింది. విమానాలు రద్దు కారణంగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ పెద్ది షూటింగ్ రద్దయ్యింది. రామ్‌చరణ్ పెద్ది కొత్త షెడ్యూల్‌ను ఈ నెల 6 నుంచి ఢిల్లీలో జరపాలని మేకర్స్ ప్లాన్ చేశారు. రామ్‌చరణ్, శివరాజ్‌కుమార్‌తో పాటు ప్రధాన తారాగణంపై క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలని అనుకున్నారు.
కానీ ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడంతో ఈ కొత్త షెడ్యూల్‌ను క్యాన్సిల్ అయ్యింది. ఈ షెడ్యూల్ రద్దుతో నిర్మాతలకు భారీగానే నష్టం వాటిల్లినట్లు టాక్ వినిపిస్తుంది. రామ్‌చరణ్, శివరాజ్‌కుమార్ డేట్స్ కూడా వేస్ట్ అయ్యాయట. ఫ్లైట్ ఈష్యూ తీరిన తర్వాతే ఢిల్లీ షెడ్యూల్‌ను తిరిగి మొదలుపెట్టాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న పెద్ది మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు మూడు వందల యాభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
పెద్ది కోసం రామ్‌చరణ్ చాలా మేకపోవర్ అయ్యారు. సినిమా మొత్తం రగ్గ్‌డ్ లుక్‌లోనే కనిపించబోతున్నారు. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. దేవర తర్వాత తెలుగులో జాన్వీకపూర్ చేస్తున్న సెకండ్ మూవీ ఇది. ఇటీవలే జాన్వీకపూర్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అచ్చియమ్మగా డేరింగ్ అండ్ డాషింగ్ రోల్‌లో కనిపించబోతుంది.
ఇటీవల పెద్ది మూవీ నుంచి చికిరి సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ సెన్సేషన్‌గా మారిండి. గ్లోబల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. యూట్యూబ్‌లో 150 మిలియన్ల వరకు వ్యూస్‌ను సొంతం చేసుకుంది. చికిరి సాంగ్‌తో పెద్దిపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
పెద్ది మూవీలో మీర్జాపూర్ వెబ్‌సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా 2026 మార్చి 27న పెద్ది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెద్ది మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



