త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi | ఐపీఎల్ మ్యాచ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌ పెద్ది ప్ర‌మోష‌న్స్ – పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈవెంట్స్‌…

రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీ జూన్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను పాన్ ఇండియ‌న్ లెవెల్‌గా భారీగా చేయ‌బోతున్నారు. ఈ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా రామ్‌చ‌ర‌ణ్ ఐపీఎల్ మ్యాచ్‌కు అటెండ్ కానున్నారు.

N

Entertainment | Published On May 14, 2026, 8.22 pm IST

Peddi | ఐపీఎల్ మ్యాచ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌ పెద్ది ప్ర‌మోష‌న్స్ – పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈవెంట్స్‌…
Advertisement

Peddi |  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన పెద్ది మూవీ జూన్ 4న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకు బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో శృతి హాస‌న్ ఓ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించ‌బోతుంది.

ముంబైలో ట్రైల‌ర్ లాంఛ్‌...

పెద్ది రిలీజ్‌కు మ‌రో ఇర‌వై రోజులు మాత్ర‌మే టైమ్ ఉంది. ఈ నేప‌థ్యంలో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో మేక‌ర్స్ భారీగా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేశారు. జూన్ 18న పెద్ది ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను ముంబైలో అట్ట‌హాజంగా నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఈవెంట్‌కు రామ్‌చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌తో పాటు మిగిలిన న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు హాజ‌రుకానున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌కు చ‌ర‌ణ్‌...

ఆ త‌ర్వాత మే 22న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న హైద‌రాబాద్ స‌న్‌రైజ‌ర్స్ వ‌ర్సెస్ బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మ్యాచ్‌లో రామ్‌చ‌ర‌ణ్ సంద‌డి చేయ‌బోతున్నారు. ఈ మ్యాచ్‌లో పెద్ది సినిమాను ప్ర‌మోట్ చేయ‌బోతున్నారు. అనంతరం మే 23న భోపాల్, మే 24న బెంగళూరు, మే 28న ఢిల్లీ, మే 30న చెన్నై, జూన్ 1న విజయనగరం, జూన్ 2న హైదరాబాద్‌లో భారీ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్స్‌లో చాలా స‌ర్‌ప్రైజ్‌లు ఉంటాయ‌ట‌. మెగా హీరోలు చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఆహ్వానించే ఆలోచ‌న‌లో పెద్ది టీమ్ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. పెద్ది మూవీకి ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్‌తో పాటు జ‌గ‌ప‌తిబాబు, దివ్యేందు శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు.

 

Advertisement
Advertisement