త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్‌ చ‌ర‌ణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

ఇటీవ‌ల పెద్ది ప్ర‌మోష‌న్స్‌లో రామ్ చ‌ర‌ణ్ చేతికి బ్యాండేజ్‌తో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఈ బ్యాండేజీ వెన‌కున్న క‌థ‌ను పెద్ది ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్ బ‌య‌ట‌పెట్టాడు. రెజ్లింగ్ సీన్లు తీస్తున్న‌ప్పుడు గాయ‌ప‌డిన‌ట్లు చెప్పారు.

N

Entertainment | Published On May 18, 2026, 7.44 pm IST

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్‌ చ‌ర‌ణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌
Advertisement

Ram Charan |  రామ్‌చ‌ర‌ణ్ పెద్ది మూవీ ట్రైల‌ర్ సోమ‌వారం రిలీజైంది. స్పోర్ట్స్ యాక్ష‌న్ అంశాల‌తో రా అండ్ ర‌స్టిక్‌గా ఈ ట్రైల‌ర్ సాగింది. క్రాస్ ఓవ‌ర్ అథ్లెట్‌గా రామ్ చ‌ర‌ణ్ యాక్టింగ్‌, అత‌డి ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ ఈ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. పెద్ది ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

జాన్వీ క‌పూర్...ఏఆర్ రెహ‌మాన్‌...

పెద్ది ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ ముంబైలో జ‌రిగింది. ఈ ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్‌, హీరోయిన్ జాన్వీక‌పూర్‌, బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహ‌మాన్‌తో పాటు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇటీవ‌లే పెద్ది ముంబై ప్ర‌మోష‌న్స్‌లో చేతికి బ్యాండేజ్‌తో రామ్‌చ‌ర‌ణ్ క‌నిపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ బ్యాండేజ్‌పై పెద్ది ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో రామ్‌చ‌ర‌ణ్ క్లారిటీ ఇచ్చారు.

బుచ్చిబాబు గిఫ్ట్‌...

బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ ఇద‌ని అన్నారు. పెద్దిలో రెజ్లింగ్ సీన్ల‌ను ఇర‌వై ఐదు రోజుల పాటు షూట్ చేశాం. ఆ స‌న్నివేశాలు రియ‌లిస్టిక్‌గా ఉండాల‌ని జూనియ‌ర్ ఆర్టిస్టుల‌ను కాకుండా నిజ‌మైన ప‌హిల్వాల్‌ల‌తో పెట్టి తీశాడు బుచ్చిబాబు. యాక్ష‌న్ అని చెప్ప‌డ‌మే ఆల‌స్యం ఆ ప‌హిల్వాన్లు నా చేతిని గ‌ట్టిగా ప‌ట్టుకునేవారు. వారి వ‌ల్లే చేతికి గాయ‌మైంది. ఈ సినిమాతో బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ ఇది అని చ‌ర‌ణ్ అన్నారు.

రెండేళ్ల క‌ష్టం...

పెద్ది కోసం రెండేళ్లు క‌ష్ట‌ప‌డ్డాన‌ని రామ్ చ‌ర‌ణ్ అన్నారు. మ‌గ‌ధీర‌, రంగ‌స్థ‌లం, ఆర్ఆర్ఆర్ త‌ర్వాత త‌న కెరీర్‌లో గుర్తుండిపోయే మూవీగా పెద్ది నిలుస్తుంద‌ని చెప్పారు. ఈ సినిమాలో జాన్వీ డ్యాన్స్‌ల‌తో పాటు యాక్టింగ్‌లోనూ అద‌ర‌గొట్టింద‌ని చెప్పారు. జాన్వీతో త‌న కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకుంటాయ‌ని రామ్‌చ‌ర‌ణ్ పేర్కొన్నారు.

 

 

Advertisement
Advertisement