Lavanya Tripathi | రామ్‌చరణ్‌కు థాంక్స్ చెప్పిన లావణ్య త్రిపాఠి – బావ అంటూ కామెంట్స్
మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటించిన సతీ లీలావతి మూవీ ట్రైలర్‌ను మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ శనివారం రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చరణ్‌కు థాంక్స్ చెప్పిన లావణ్య త్రిపాఠి...అతడిని బావ అంటూ పిలిచింది.
Entertainment | Published On May 2, 2026, 4.04 pm IST
Lavanya Tripathi | మెగా కోడలు లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న సతీ లీలావతి మూవీ మే 8న రిలీజ్ కాబోతుంది. పెళ్లి తర్వాత లావణ్య త్రిపాఠి చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రైలర్ రిలీజ్...
సతీ లీలావతి ట్రైలర్‌ను శనివారం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రామ్‌చరణ్‌కు స్పెషల్‌గా థాంక్స్ చెప్పింది లావణ్య త్రిపాఠి. మా బావ అంటూ చరణ్‌ను ఉద్దేశించి లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
రీచ్ పెరిగింది...
లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. ‘‘సతీ లీలావతి’ కోసం మేం పెట్టిన శ్రమ, మా ప్రేమ, మా కష్టాన్ని ఆడియెన్స్ గుర్తిస్తారనే నమ్మకముంది. చిత్రీకరణ సమయంలో నేను ప్రెగ్నెంట్ అని తెలిశాక టీం మొత్తం చాలా సపోర్ట్ చేసింది. దేవ్ మోహన్ ఈ సినిమా కోసం సొంతంగా డబ్బింగ్ చెప్పారు. మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన మా బావ రామ్ చరణ్‌కు థాంక్స్. ఆయన రిలీజ్ చేయడం వల్ల మా ట్రైలర్‌కి, మా సినిమాకు రీచ్ పెరిగింది అని చెప్పింది.ఇంట్లో మాత్రం అలా పిలవను...
"పెళ్లి తర్వాత తెలుగు సంప్రదాయాలు, రిలేషన్స్ గురించి తెలుసుకుంటున్నా. ఇంట్లో మాత్రం చరణ్‌ను బావ అని పిలవను. నన్ను ఆర్‌సీ అని పిలిస్తే చాలని చరణ్ ఆప్షన్ ఇచ్చారు. రిలేషన్స్‌కు చరణ్ కూడా చాలా వాల్యూ ఇస్తారు. ఏ సాయం కావాలన్న చేయడానికి మేం అందరం ఉన్నా అని ఎప్పుడూ చెబుతుంటారు. రామ్ చరణ్ చాలా సపోర్టివ్‌గా ఉంటారు" అని ఈ వేడుకలో లావణ్య త్రిపాఠి చెప్పింది.
ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో దేవ్‌మోహన్, కమెడియన్లు సప్తగిరి, తాగుబోతు రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత సతీ లీలావతితో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా రీఎంట్రీ ఇవ్వబోతుంది లావణ్య త్రిపాఠి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



