త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan | రామ్ చరణ్ ఊర మాస్ స్టెప్పులు.. జాన్వీ, శృతి గ్లామర్ ర‌చ్చ‌.. హల్లల్లల్లో ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్!

పెద్ది నుంచి హ‌ల్ల‌ల్ల‌ల్లో ఫుల్ సాంగ్‌ను మేక‌ర్స్ ఆదివారం రిలీజ్ చేశారు.ఈ పాట‌కు రామ్‌చ‌ర‌ణ్ ఊర మాస్ స్టెప్పులు, జాన్వీ క‌పూర్‌, శృతి హాస‌న్ గ్లామ‌ర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి.

N

Entertainment | Published On May 24, 2026, 3.24 pm IST

Ram Charan | రామ్ చరణ్ ఊర మాస్ స్టెప్పులు.. జాన్వీ, శృతి గ్లామర్ ర‌చ్చ‌.. హల్లల్లల్లో ఫుల్ సాంగ్ వచ్చేసిందోచ్!
Advertisement

Ram Charan |  రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తోన్న పెద్ది మూవీ జూన్ 4న రిలీజ్ కాబోతుంది. రిలీజ్‌కు మ‌రో ప‌ది రోజులు మాత్ర‌మే టైమ్ ఉండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ జోరు పెంచారు. రోజుకో స్సెష‌ల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేస్తోన్నారు.తాజాగా పెద్ది నుంచి హ‌ల్ల‌ల్ల‌ల్లో ఫుల్ సాంగ్‌ను ఆదివారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌లో శృతి హాస‌న్‌, జాన్వీ క‌పూర్ ల‌తో క‌లిసి రామ్‌చ‌ర‌ణ్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. ముగ్గురు పోటీప‌డి డ్యాన్స్ చేశారు.

ఎన‌ర్జిటిక్ డ్యాన్స్‌...

ఫోక్ స్టైల్‌లో సాగిన ఈ మాస్ సాంగ్‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ర‌క్షితా సురేష్ ఆల‌పించింది. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించారు. ఈ పాటలో రామ్ చరణ్, శృతి హాసన్, జాన్వీ కపూర్ ముగ్గురూ త‌మ స్క్రీన్ ప్ర‌జెన్స్‌తో ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ స్టైలిష్ లుక్, ఎన‌ర్జిటిక్‌ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు. శృతి హాసన్ తన గ్లామర్, గ్రేస్‌తో ఈ పాట‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. జాన్వీ కపూర్ మాసీ స్టెప్పుల‌తో ఆక‌ట్టుకుంది. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో విజువల్ ట్రీట్‌గా ఈ పాట సాగింది. ర‌క్షితా సురేష్ ప‌వ‌ర్‌ఫుల్ వాయిస్‌కు రెహ‌మాన్ బీట్స్ తోడ‌వ్వ‌డం కూడా ఈ పాట‌కు ప్ల‌స్స‌య్యింది. హ‌ల్ల‌ల్ల‌ల్లో సాంగ్‌ను గ్రాండియ‌ర్‌గా డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా తెర‌కెక్కించారు.

ట్రెండింగ్‌లో...

శ‌నివారం భోపాల్‌లో జ‌రిగిన పెద్ది కీ అవాజ్ ఈవెంట్‌లోనే హ‌ల్ల‌ల్ల‌ల్లో సాంగ్‌ను రిలీజ్ చేశారు. డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి మాత్రం ఆదివారం నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం యూట్యూబ్‌తో పాటు మిగిలిన మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది.పెద్ది మూవీలో రామ్‌చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌గా...శృతి హాస‌న్ హ‌ల్ల‌ల్ల‌ల్లో సాంగ్‌లో మాత్ర‌మే న‌టించింది. పెద్ది ట్రైల‌ర్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.ఈ ట్రైల‌ర్ వంద మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకొని రికార్డ్ క్రియేట్ చేసింది.సంక్రాంతి సీజ‌న్ త‌ర్వాత గ‌త మూడు నెల‌లుగా టాలీవుడ్‌లో స‌రైన హిట్టు లేదు. పెద్ది ఆ లోటున భ‌ర్తీ చేసే సినిమా అవుతుంద‌ని ఫ్యాన్స్ భారీగా ఆశ‌లు పెట్టుకున్నారు.

Advertisement
Advertisement