త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Peddi Movie | పెద్ది నుంచి కిరాక్ అప్‌డేట్ – డ‌బ్బింగ్ మొద‌లుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్‌

పెద్ది మూవీ నుంచి సూప‌ర్ అప్‌డేట్‌ను ఆదివారం మేక‌ర్స్ అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ సినిమా డ‌బ్బింగ్‌ను రామ్‌చ‌ర‌ణ్ స్టార్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతుంది.

N

Entertainment | Published On Mar 1, 2026, 6.14 pm IST

Peddi Movie  | పెద్ది నుంచి కిరాక్ అప్‌డేట్ – డ‌బ్బింగ్ మొద‌లుపెట్టిన రామ్‌చ‌ర‌ణ్‌
Advertisement

Peddi Movie | రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది నుంచి కిరాక్ అప్‌డేట్ వ‌చ్చేసింది. స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ ఏప్రిల్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

డ‌బ్బింగ్ షురూ...

పెద్ది మూవీ షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది. ఓ వైపు చిత్రీక‌ర‌ణ జ‌రుపుతూనే మ‌రోవైపు నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌ను చ‌క‌చ‌కా పూర్తిచేసే ప‌నిలో ప‌డ్డారు. తాజాగా పెద్ది మూవీ డ‌బ్బింగ్‌ను రామ్‌చ‌ర‌ణ్ మొద‌లుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను పెద్ది టీమ్ అభిమానుల‌తో పంచుకున్న‌ది. డ‌బ్బింగ్ స్టూడియోలో హీరో రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానాకు మధ్య సాగిన ఓ స‌ర‌దా సంభాష‌ణ‌ను మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

సెకండ్ సింగిల్‌...

కాగా పెద్ది మూవీ నుంచి సెకండ్ సింగిల్ ర‌య్ ర‌య్ రారా సాంగ్‌ను మార్చి 2న సోమ‌వారం రిలీజ్ చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజైన ఫ‌స్ట్ సింగిల్ చికిరి పెద్ద హిట్ట‌య్యింది. దాంతో సెకండ్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఆస్కార్ విన్న‌ర్‌...

తొలుత ఈసినిమాను రామ్‌చ‌ర‌ణ్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మార్చి 27న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ డిలే వ‌ల్ల ఈ సినిమా ఏప్రిల్ 30కి వాయిదా ప‌డింది. పెద్ది మూవీలో క‌న్న‌డ న‌టుడు శివ‌రాజ్‌కుమార్‌తో పాటు దివ్యేందు శ‌ర్మ‌, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ దాదాపు నాలుగు వంద‌ల కోట్ల‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. పెద్ది త‌ర్వాత డైరెక్ట‌ర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌.

Advertisement
Advertisement