Ram Charan | అభిమానుల అత్యుత్సాహం – ఇబ్బంది పడిన రామ్ చరణ్
Ram Charan | అభిమానులు అత్యుత్సాహం వల్ల మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఇబ్బందులు పడ్డారు. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. భార్యాబిడ్డలను చూడటానికి హాస్పిటల్‌కు వచ్చిన చరణ్‌నుఅభిమానులు చుట్టుముట్టారు.
Entertainment | Published On Feb 1, 2026, 2.44 pm IST
Ram Charan | అభిమానుల అత్యుత్సాహంతో స్టార్స్‌కు ఇబ్బందులు తప్పడం లేదు. ఇటీవలే రాజాసాబ్ ప్రమోషన్స్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌తో ఫ్యాన్స్ అనుచితంగా ప్రవర్తించారు. ఆమెను చుట్టుముట్టి కారు ఎక్కకుండా చేశారు. ఈ మధ్య కాలంలో... మహేష్‌బాబు, సమంత, అమితాబ్ బచ్చన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులకు కూడా అభిమానుల వల్ల ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి.
తోపులాట...
తాజాగా రామ్‌చరణ్‌ను అభిమానులు చుట్టుముట్టేశారు. చరణ్ దగ్గరకు చేరుకునేందుకు ఫ్యాన్స్ ప్రయత్నించడంలో తోపులాట జరిగింది. రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించారు. తన కూతురు, కొడుకును చూసేందుకు రామ్‌చరణ్...ఆదివారంహాస్పిటల్ వద్దకు వచ్చారు. మెగా ఫ్యామిలీ హాస్పిటల్‌కు వస్తారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడ గుమిగూడారు. చరణ్ వచ్చి రావడంతోనే అతడిని చుట్టుముట్టేశారు. కూతురు క్లీంకార భుజాన ఉండటంతో సంయమనం పాటించాలని చరణ్ విజ్ఞప్తి చేసిన ఫ్యాన్స్ వినలేదు. చరణ్‌ను కలవడానికి ముందుకు తోసుకువచ్చారు. మీద పడే ప్రయత్నం చేశారు. అభిమానుల ప్రవర్తనతో చరణ్ చాలా ఇబ్బంది పడ్డారు. చరణ్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడటంతో తోపులాట జరిగింది. సెక్యూరిటీ సహాయంలో చాలా కష్టంగా అభిమానుల మధ్య నుంచి చరణ్ హాస్పిటల్‌లో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కూతురు భుజాన...
కూతురు భుజాన ఉండటంతో ఆమెకు ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అనే భయం చరణ్ ముఖంలో కనిపించిందని వీడియోను ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. సాధారణంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్ చాలా కూల్‌గా కనిపిస్తారు. కానీ ఫస్ట్ టైమ్ చరణ్ కోపగించుకోవడం చూశామని అంటున్నారు. అభిమానం పేరుతో హద్దులు దాటడం కరెక్ట్ కాదని పేర్కొంటున్నారు.కాగా క్లీంకార ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయద్దని రామ్ చరణ్ టీమ్ పేర్కొన్నది. క్లీంకారా ఫొటోలు పోస్ట్ చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది.
మెగా ఫ్యామిలీ హ్యాపీ...
కాగా రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించడంతో మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగిపోయింది. ఓ మగబిడ్డతో పాటు ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చిందని , తల్లితో పాటు బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు చిరంజీవి వెల్లడించారు. తమ ఇంట శుభం కలగాలని కోరుకున్న అభిమానులు అందరికి కృతజ్ఞతలు చెప్పారు చిరంజీవి.
https://x.com/KollyCensor/status/2017865684500566342?s=20
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



