త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakul Preet Singh | అల‌నాటి దిగ్గ‌జ హీరోయిన్‌గా ర‌కుల్ – ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌లో ఛాన్స్

దిగ్గ‌జ క‌ర్ణాట‌క సంగీత క‌ళాకారిణి ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి జీవితం ఆధారంగా తెలుగులో ఓ సినిమా రాబోతుంది. ర‌ష్మిక మంద‌న్న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ మూవీ ఇటీవ‌లే  ఘనంగా ప్రారంభ‌మైంది. ఈ బ‌యోపిక్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అల‌నాటి దిగ్గ‌జ హీరోయిన్ వైజ‌యంతి మాల పాత్ర కోసం ఈ ఢిల్లీ బ్యూటీని మేక‌ర్స్ సెలెక్ట్ చేసిన‌ట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

N

Entertainment | Published On Oct 11, 2026, 5.38 pm IST

Rakul Preet Singh | అల‌నాటి దిగ్గ‌జ హీరోయిన్‌గా ర‌కుల్ – ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌లో ఛాన్స్
Advertisement

Rakul Preet Singh |ఐదేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత ర‌కుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్‌లో ఓ బంప‌రాఫ‌ర్‌ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌లో అల‌నాటి దిగ్గ‌జ హీరోయిన్ పాత్ర‌లో ఈ బాలీవుడ్ బ్యూటీ క‌నిపించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

టైటిల్ పాత్ర‌లో...

లెజెండ‌రీ సింగ‌ర్ ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి జీవితం ఆధారంగా తెలుగులో ఓ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్కుతోంది. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాకు జెర్సీ ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

చీఫ్ గెస్ట్‌...

ఇటీవ‌ల చెన్నైలో ఈ బ‌యోపిక్ ప్రారంభోత్స‌వ వేడుక‌ ఘ‌నంగా జ‌రిగింది. ఈ ఈవెంట్‌కు విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యారు. డిసెంబ‌ర్ నుంచి ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం.

వైజ‌యంతి మాల...

ఈ బ‌యోపిక్‌కు సంబంధించిన ఇత‌ర న‌టీన‌టుల‌ను ఎంపిక‌చేసే ప‌నిలో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి బిజీగా ఉన్నారు.  ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అల‌నాటి హీరోయిన్ వైజ‌యంతి మాల పాత్ర‌లో ఈ ఢిల్లీ సుంద‌రి క‌నిపించ‌నుంద‌ని అంటున్నారు. ఫ‌స్ట్ ఫిమేల్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్‌గా పేరుతెచ్చుకున్న వైజ‌యంతి మాల...సుబ్బుల‌క్ష్మి ద‌గ్గ‌రే సంగీతం నేర్చుకున్నారు. ఇద్ద‌రి మ‌ధ్య స్నేహానికి మించిన బాండింగ్ ఉండేది. వారి అనుబంధాన్ని సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌లో ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఆవిష్క‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

నిడివి త‌క్కువే...

వైజ‌యంతి మాల పాత్ర కోసం ర‌కుల్‌ను సెలెక్ట్ చేసిన‌ట్లు తెలిసింది. పాత్ర నిడివి త‌క్కువే అయినా క‌థ‌లో కీల‌కంగా ఉంటుంద‌ని అంటున్నారు. గీతా ఆర్ట్స్‌తో పాటు అల్లు అర్జున్‌తో ఉన్న అనుబంధం కార‌ణంగా ర‌కుల్ ఈ సినిమాకు ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

ఐదేళ్ల త‌ర్వాత‌...

ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్‌తోనే ఐదేళ్ల సుదీర్ఘ విరామం త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది ర‌కుల్ ప్రీత్ సింగ్‌. చివ‌ర‌గా తెలుగులో క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కొండ‌పొలం సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది. ఈ డిజాస్ట‌ర్ త‌ర్వాత టాలీవుడ్‌కు దూర‌మైంది. హిందీలో ప్ర‌స్తుతం రామాయ‌ణ సినిమా చేస్తోంది ర‌కుల్‌. ర‌ణ‌బీర్‌క‌పూర్, సాయిప‌ల్ల‌వి సీతారాముడి పాత్ర‌ల్లో క‌నిపిస్తోన్న ఈ మూవీలో శూర్ప‌న‌ఖ పాత్ర‌ను రకుల్ పోషించింది.

 

Advertisement
Advertisement