త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakul Preet Singh | గ్యాప్ ఇవ్వ‌లేదు…వ‌చ్చింది – టాలీవుడ్‌కు దూరం కావ‌డంపై ర‌కుల్ కామెంట్స్‌

తెలుగు సినిమాల‌కు దూరం కావ‌డంపై ర‌కుల్ ప్రీత్‌సింగ్ ఆస‌క్తిక‌ర కామెంట్లు చేసింది. గ్యాప్ తాను కావాల‌ని ఇచ్చింద‌ని కాద‌ని, అనుకోకుండా వ‌చ్చింద‌ని తెలిపింది. వ‌చ్చే ఏడాది తెలుగులో ఓ సినిమా చేసే అవ‌కాశం ఉందంటూ హింట్ ఇచ్చింది ర‌కుల్‌.

N

Entertainment | Published On Nov 1, 2026, 4.51 pm IST

Rakul Preet Singh | గ్యాప్ ఇవ్వ‌లేదు…వ‌చ్చింది – టాలీవుడ్‌కు దూరం కావ‌డంపై ర‌కుల్ కామెంట్స్‌
Advertisement

Rakul Preet Singh | ర‌కుల్ ప్రీత్ సింగ్ తెలుగు తెర‌పై క‌నిపించి ఐదేళ్లు దాటిపోయింది. చివ‌ర‌గా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన కొండ‌పొలంలో న‌టించింది. 2021లో రిలీజైన ఈ సినిమా డిజాస్ట‌ర్‌గా నిల‌వ‌డంతో టాలీవుడ్‌కు టాటా చెప్పేసిన ర‌కుల్ బాలీవుడ్‌లో సెటిలైంది. నిర్మాత జాకీ భ‌గ్నానీని పెళ్లి చేసుకుంది.

రామాయ‌ణ ప్ర‌మోష‌న్స్‌...

ర‌కుల్ తెలుగులోకి మ‌ళ్లీ క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌డం క‌ష్ట‌మేనంటూ చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రూమ‌ర్ల‌పై రామాయ‌ణ ప్ర‌మోష‌న్స్‌లో క్లారిటీ ఇచ్చింది. గ్యాప్ తాను కావాల‌ని ఇచ్చింది కాద‌ని, అనుకోకుండా వ‌చ్చింద‌ని చెప్పింది.

కొన్ని క‌మిట‌య్యాను...

"కొండ‌పొలం త‌ర్వాత తెలుగులో కొన్ని సినిమాల‌ను క‌మిట‌య్యాను. కానీ అదే టైమ్‌లో కొవిడ్ రావ‌డంతో షూటింగ్‌లు ఆగిపోయాయి. దాంతో ముంబై వెళ్లిపోయా. బాలీవుడ్‌లో వ‌రుస‌గా అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డే సినిమాలు చేసుకుంటూ వ‌చ్చాను. ముంబైలో ఉన్న నా మ‌న‌సంతా టాలీవుడ్‌పైనే ఉంది. మంచి క‌థ‌తో మ‌ళ్లీ తెలుగులోకి పున‌రాగ‌మ‌నం చేయాల‌ని ఎదురుచూస్తున్నారు. గ‌త రెండేళ్ల‌లో చాలానే క‌థ‌లు విన్నా. కానీ అవేవీ న‌న్ను ఆక‌ట్టుకోలేక‌పోయాయి" అని చెప్పింది. వ‌చ్చే ఏడాది ఆ క‌ల తీరుతుంద‌ని న‌మ్మ‌క‌ముందని అన్న‌ది.

శూర్ప‌ణ‌ఖ‌...

రామాయ‌ణ మూవీలో ర‌కుల్ ప్రీత్ సింగ్ శూర్ప‌ణ‌ఖ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ర‌ణ‌బీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న ఈ సినిమా న‌వంబ‌ర్ 5న థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. రామాయ‌ణ గాథ ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా కోసం ర‌కుల్ ప్రీత్ సింగ్ రెండు కోట్ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

 

ట్యాగ్స్:

Rakul Preet SinghRakul Preet Singh Telugu MoviesRamayan MovieTelugu CinemaTollywood
Advertisement
Advertisement