Rakul Preet Singh | ప్రభాస్ సినిమా నుంచి నన్ను తీసేశారు – రకుల్ కామెంట్స్…
రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించిన పతి పత్నీ ఔర్ వో దో మూవీ మే 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలపై రకుల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రభాస్ సినిమా నుంచి తనను తీసేశారని అన్నది.
Entertainment | Published On May 8, 2026, 6.25 pm IST
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదహారేళ్లు దాటిపోయింది. కన్నడ మూవీ గిల్లీతో యాక్టింగ్ జర్నీని మొదలుపెట్టిన రకుల్ టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది. అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. పరాజయాల కారణంగా గత ఐదేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న రకుల్ బాలీవుడ్‌లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది.
మే 15న రిలీజ్...
రకుల్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ రొమాంటిక్ మూవీ పతీ పత్నీ ఔర్ వో దో సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలపై రకుల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది.
ఈజీ కాదు...
ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వారికి అవకాశాలు రావడం అంత ఈజీ కాదని, కొన్ని సార్లు ఆఫర్ల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సివస్తుందని రకుల్ అన్నది. డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ఉండగా కన్నడ మూవీ గిల్లీలో అవకాశం వచ్చిందని , కేవలం పాకెట్ మనీ కోసమే ఆ సినిమా చేశానని రకుల్ చెప్పింది. ఆ సినిమా షూటింగ్‌లోనే యాక్టింగ్ పట్ల ఆసక్తి మొదలవ్వడంతో ఇండస్ట్రీలోనే సెటివ్వాలని నిర్ణయించుకున్నానని రకుల్‌పేర్కొన్నది.
మిస్ ఇండియా ఫైనల్...
"మిస్ ఇండియా ఫైనల్ చేరుకోవడంతో నాకు ఆఫర్లు క్యూ కడతాయని అనుకున్నా. కానీ నేను ఊహించినట్లుగా జరగలేదు. ఆ టైమ్‌లో ఎన్నో ఆడిషన్స్‌కు అటెండ్ అయ్యా. వందలాది మందితో కలిసి లైన్లలో నిల్చొనేదానిని. కొన్నింటిలో సెలెక్ట్ అయ్యా. కానీ షూటింగ్ రోజు నా బదులు మరొకరిని తీసుకునే వారు. కాస్టింగ్ డైరెక్టర్లకు ప్రతి రోజు వందకుపైగా ఫోన్ కాల్స్ చేసేదానిని. కొన్నాళ్లకు వాళ్లు నా ఫోన్లు ఎత్తడం మానేశారు. రకుల్ అనే హీరోయిన్ ఉందని పెద్ద దర్శకులకు నా పేరు తెలియడానికే చాలా ఏళ్లు పట్టింది" అని రకుల్ అన్నది.
స్టార్ హీరోల సినిమాల నుంచి కూడా తనను చాలా సార్లు తీసేశారని చెప్పింది. ప్రభాస్ సినిమాలో హీరోయిన్‌గా నాలుగు రోజులు షూటింగ్ చేసిన తర్వాత తన స్థానంలో మరో హీరోయిన్‌ను ఎంచుకున్నారని తెలిపింది. ఆ ప్రభాస్ మూవీ మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటూ ప్రచారం జరుగుతోంది. రకుల్‌ను తీసేసిన మేకర్స్ ఆమె ప్లేస్‌లో కాజల్ అగర్వాల్‌ను కథానాయికగా ఎంచుకున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తోన్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






