Rakul Preet Singh | హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ అమ్మేసిన రకుల్ – కారణం ఇదేనా?
హైదరాబాద్‌లోని ఆస్తులన్నింటిని రకుల్ ప్రీత్‌సింగ్ అమ్మేసినట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఎఫ్ 45 ఫిట్‌నెస్ ఫ్రాంచైజ్‌తో పాటు ఆరంభ రెస్టారెంట్ బిజినెస్‌ల నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Feb 1, 2026, 9.40 pm IST
Rakul Preet Singh | టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హవా చాలా రోజులే కొనసాగింది. మహేష్‌బాబు, రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో పాటు స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. తక్కువ టైమ్‌లోనే నంబర్ వన్ ప్లేస్‌కు చేరుకుంది. ఎంత వేగంగా టాప్ పొజిషన్‌కు చేరుకుందో అంతే త్వరగా రకుల్ కెరీర్ డౌనయ్యింది. ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేయడం, పరాజయాలు రకుల్ జోరుకు బ్రేకులు వేశాయి.
కొండపొలం తర్వాత...
క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్ హీరోగా వచ్చిన కొండపొలం తర్వాత తెలుగులో మళ్లీ కనిపించలేదు రకుల్ ప్రీత్ సింగ్. టాలీవుడ్‌లో రీఎంట్రీపై బోలెడు ఆశలు పెట్టుకుంది. కానీ ఐదేళ్లు అయినా ఒక్క అవకాశం రాలేదు.
బిజినెస్‌లో...
తెలుగులో సినిమాలు చేస్తున్న టైమ్‌లోనే హైదరాబాద్‌లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసింది రకుల్ ప్రీత్‌సింగ్. అలాగే ఎఫ్ 45 పేరుతో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, కోకాపేట తో పాటు మరికొన్ని ఏరియాల్లో ఫిట్‌నెస్ సంస్థలను స్థాపించింది. ఇవే కాకుండా ఆరంభ పేరుతో ఓ రెస్టారెంట్‌ను మరొకరి పార్ట్‌నర్‌షిప్‌తో ప్రారంభించింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే ఈ బిజినెస్‌లను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేసింది రకుల్ ప్రీత్‌సింగ్.
ఇటీవలే ఎఫ్45 ఫిట్‌నెస్ ఫ్రాంచైజ్‌లతో పాటు ఆరంభ రెస్టారెంట్ బిజినెస్ నుంచి రకుల్ తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సైతం అమ్మేసినట్లు సమాచారం. హైదరాబాద్‌కు గుడ్‌బై చెప్పేసి కంప్లీట్‌గా ముంబైలోనే సెటిలవ్వాలని రకుల్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
రీఎంట్రీ కష్టమే...
టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దర్శకనిర్మాతలు సైతం రకుల్ ప్రీత్‌సింగ్‌ను మర్చిపోయారు. మరోవైపు కొత్త హీరోయిన్ల జోరుతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టంగా మారింది. తెలుగులో సినిమా చేసేందుకు రకుల్ చాలానే ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి వర్కవుట్ కాలేదని సమాచారం. దాంతో టాలీవుడ్ పై రకుల్ పూర్తిగా ఆశలు వదులుకున్నట్లు సమాచారం. మరోవైపు రకుల్ సోదరుడు డ్రగ్స్ కేసులో రెండు సార్లు చిక్కుకున్నాడు. కెరీర్ ఆశాజనకంగా లేకపోవడం, సోదరుడి వరుస వివాదాల కారణంగానే రకుల్ హైదరాబాద్‌లోని ఆస్తులన్నీ అమ్మేసి ముంబాయికి మకాం మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
తెలుగులో కెరీర్ క్లోజ్ అయినా బాలీవుడ్‌లో మాత్రం ఇప్పటికీ హీరోయిన్‌గా అవకాశాలను అందుకుంటోంది. గత ఏడాది దే దే ప్యార్ దే 2తో పాటు మేరే హజ్బెండ్‌కీ బీవీ సినిమాలు చేసింది. ప్రస్తుతం పతీ పత్నీ ఔర్ దో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా
- ●JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా
- ●Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్
- ●China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి
- ●Bhatti Vikramarka | రైతు భరోసాకు మరో రూ.1,900 కోట్లు.. ఖమ్మం సభలో డిప్యూటీ భట్టి ప్రకటన
- ●Damodara nd Vivek | ఈఎస్ఐ డిస్పెన్సరీ సేవలు మరింత బలోపేతం చేస్తున్నాం

Medigadda Barrage | మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల.. ఆ మూడు లిఫ్టులు వాడితేనే సేఫ్ : రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం కీలక సలహా

JP Nadda | దేశానికే ఆదర్శంగా బీబీనగర్ ఎయిమ్స్ : కేంద్రమంత్రి జేపీ నడ్డా

Jana Nayagan | దళపతి విజయ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ - జననాయగన్ సెన్సార్ కంప్లీట్ - మూడు గంటల రన్టైమ్తో రిలీజ్

China Floods | చైనాలో వరద బీభత్సం: నీటిలో కొట్టుకొచ్చిన 900 విష సర్పాలు.. పాముకాటుతో మహిళ మృతి






