త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rakul Preet Singh | ఓటీటీలోకి ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – ముగ్గురు ప్రియురాళ్ల మ‌ధ్య న‌లిగిపోయే ప్రియుడి క‌థ‌

ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ప‌తి ప‌త్నీ ఔర్ వో దో ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. జూలై 10న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా క‌నిపించిన ఈ సినిమాలో ర‌కుల్ ప్రీత్‌సింగ్‌, సారా అలీఖాన్‌, వామికా గ‌బ్బి హీరోయిన్లుగా న‌టించారు.

N

Entertainment | Published On Jun 30, 2026, 4.15 pm IST

Rakul Preet Singh | ఓటీటీలోకి ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ – ముగ్గురు ప్రియురాళ్ల మ‌ధ్య న‌లిగిపోయే ప్రియుడి క‌థ‌
Advertisement

Rakul Preet Singh |  ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించిన బాలీవుడ్ రొమాంటిక్ మూవీ ప‌తి ప‌త్నీ ఔర్ వో దో థియేట‌ర్ల‌లో మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఆయుష్మాన్ ఖురానా హీరోగా న‌టించ‌గా... ర‌కుల్ ప్రీత్‌సింగ్‌తో పాటు సారా అలీఖాన్‌, వామికా గ‌బ్బి హీరోయిన్లుగా క‌నిపించారు. 2019లో రిలీజై బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ప‌తి ప‌త్నీ ఔర్ వో కు సీక్వెల్‌గా రూపొందిన ఈ రొమాంటిక్ మూవీకి ముద‌స్సార్ అజీజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 65 కోట్ల వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర్వాలేద‌నిపించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో...

తాజాగా ప‌తి ప‌త్నీ ఔర్ వో దో మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖ‌రారైంది. జూలై 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ బాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ప‌తి ప‌త్నీ ఔర్ వో దో మూవీలో కామెడీ, రొమాంటిక్ సీన్లు బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్లు వ‌చ్చాయి. ముఖ్యంగా ఆయుష్మాన్ ఖురానా, సారా అలీఖాన్ త‌మ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకున్నారు. కాన్సెప్ట్ మాత్రం ఔట్‌డేటెడ్ అంటూ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

ప్ర‌జాప‌తి క‌ష్టాలు...

ప్ర‌జాప‌తి ఫారెస్ట్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. భార్య అప‌ర్ణ‌తో క‌లిసి హ్యాపీగా అత‌డి జీవితం సాగిపోతుంటుంది. అనుకోకుండా చంచ‌ల్‌ అమ్మాయితో ప్ర‌జాప‌తి దిగిన ఓ ఫొటో అప‌ర్ణ‌కు దొరుకుతుంది. ఓ స‌మ‌స్య‌లో చిక్కుకున్న చంచ‌ల్‌ను కాపాడ‌టానికి త‌న భార్య‌గా అబ‌ద్దం చెబుతాడు ప్ర‌జాప‌తి. అదే నిజం అని భ‌ర్త‌తో అప‌ర్ణ గొడ‌వ ప‌డుతోంది. అదే టైమ్‌లో ప్ర‌జాప‌తి జీవితంలోకి మ‌రో యువ‌తి నిలోఫ‌ర్ వ‌స్తుంది. ఈ ముగ్గురు మ‌ధ్య ప్ర‌జాప‌తి ఎలా న‌లిగిపోయాడు? భ‌ర్త గురించి అప‌ర్ణ‌కు ఎలాంటి నిజాలు తెలిశాయి అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

రామాయ‌ణ‌లో...

ప్ర‌స్తుతం రామాయ‌ణ‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ న‌టిస్తోంది. ఈ మూవీలో శూర్ఫ‌న‌ఖ పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. ర‌ణ‌భీర్‌క‌పూర్‌, సాయిప‌ల్ల‌వి హీరోగా న‌టిస్తోన్న ఈ మైథ‌లాజిక‌ల్ మూవీ ఈ ఏడాది దీపావ‌ళికి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.  దాదాపు నాలుగు వేల కోట్ల బ‌డ్జెట్‌తో రెండు పార్ట్‌లుగా రామాయ‌ణ తెర‌కెక్కుతోంది.

 

Advertisement
Advertisement