OTT | ఈ వీకెండ్ ఓటీటీలో మిస్సవ్వకుండా చూడాల్సిన తెలుగు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే
OTT | ఈ వారం ఓటీటీ (Ott) లవర్స్‌కు పండగగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళంతో (Malayalam)పాటు వివిధ భాషల్లో కలిపి శుక్రవారం ఒక్కరోజే ఇరవైకిపైగా సినిమాలు, సిరీస్‌లు విడుదలయ్యాయి. వెరైటీ కాన్సెప్ట్‌లతో ఈ వారం ఓటీటీలో రిలీజైన తెలుగు సినిమాలు ఏవంటే?
Entertainment | Published On Dec 19, 2025, 2.56 pm IST
ఓటీటీ
OTT | ఈ వారం డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ (Ott) ప్రేక్షకుల ముందుకొచ్చాయి. తెలుగు, తమిళం, మలయాళంతో పాటు వివిధ భాషల్లో కలిపి ఇరవైకిపైగా సినిమాలు, సిరీస్‌లు శుక్రవారం ఒక్కరోజే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజయ్యాయి. హారర్, కామెడీ కథాంశాలతో కూడిన కొన్ని తెలుగు సినిమాలు ఓటీటీ లవర్స్‌ను మెప్పించేందుకు రెడీ అయ్యాయి. ఆ సినిమాలు సిరీస్‌లు ఏవంటే?
సంతాన ప్రాప్తిరస్తు...
విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన సంతాన ప్రాప్తిరస్తు మూవీ శుక్రవారం జియో హాట్‌స్టార్‌తో(Jio Hotstar) పాటు అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది. బోల్డ్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీకి సంజీవ్ దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఈ మూవీ ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయాయి.
రాజు వెడ్స్ రాంబాయి
చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన రాజు వెడ్స్ రాంబాయి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్‌గా రూపొందిన ఈ సినిమాలో అఖిల్ రాజ్, తేజస్వి రావ్ హీరోహీరోయిన్లుగా నటించారు. సాయిలు కంపాటి డైరెక్టర్.
ప్రేమంటే
ప్రియదర్శి హీరోగా నటించిన ప్రేమంటే మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix)విడుదలైన ఈ మూవీలో ఆనంది హీరోయిన్గా నటించింది. యాంకర్ సుమ కనకాల కీలక పాత్ర పోషించింది.
నయనం
సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన నయనం వెబ్‌సిరీస్‌తో హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. బిగ్‌బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ కీలక పాత్రలో నటించిన ఈ సిరీస్‌కు స్వాతి ప్రకాష్ దర్శకత్వం వహించారు. నయనం సిరీస్ జీ తెలుగులో అందుబాటులో ఉంది.
దివ్య దృష్టి
సునీల్, ఇషా చావ్లా, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దివ్యదృష్టి థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజైంది.
ఇవే కాకుండా మఫ్టీ పోలీస్ (సన్ నెక్స్ట్) డొమినిక్ ( జీ5 ఓటీటీ), ఫార్మా వెబ్ సిరీస్ (జియో హాట్‌స్టార్) కూడా తెలుగు ఓటీటీ లవర్స్ ముందుకొచ్చాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






