త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Singer Sunitha | హీరోగా సింగ‌ర్ సునీత కొడుకు – బావ‌మ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌క‌థ‌లో మ‌లుపు

సింగ‌ర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. కొత్త మ‌లుపు పేరుతో ఓ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీ చేశాడు. భైర‌వి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ జూన్ 12న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది.

N

Entertainment | Published On Jun 1, 2026, 8.07 pm IST

Singer Sunitha | హీరోగా సింగ‌ర్ సునీత కొడుకు – బావ‌మ‌ర‌ద‌ళ్ల ప్రేమ‌క‌థ‌లో మ‌లుపు
Advertisement

Singer Sunitha |  సింగ‌ర్‌ సునీత తనయుడు ఆకాష్ హీరోగా ఓ రొమాంటిక్ ల‌వ్‌స్టోరీతో త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. కొత్త మ‌లుపు అనే టైటిల్‌తో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో బావ మ‌ర‌ద‌ళ్ల అనుబంధంతో రూపొందుతోన్న ఈ మూవీ జూన్ 12న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా న‌టిస్తోంది. శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ రిలీజ్ చేస్తోంది.సోమ‌వారం హైద‌రాబాద్‌లో కొత్త మ‌లుపు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు సింగ‌ర్ సునీత‌తో పాటు సీనియ‌ర్ హీరో భాను చంద‌ర్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు.

డిఫ‌రెంట్‌గా...

“రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జాన‌ర్‌లో కొత్త మ‌లుపు చాలా డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ఇందులో ఆకాష్, భైరవి బావ–మ‌ర‌ద‌లి పాత్రల్లో కనిపించనున్నారు. కోనసీమ అందాల‌తో గ్రామీణ నేప‌థ్యంలో మంచి కామెడీ ఉంటుంది" అని ద‌ర్శ‌కుడు అన్నారు. ఆకాష్ ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి చేరుకున్నాడ‌ని సింగ‌ర్ సునీత తెలిపింది.

ట‌ర్నింగ్ పాయింట్‌...

హీరో ఆకాష్ మాట్లాడుతూ, “ హీరోగా నా కెరీర్‌కు ఓ ట‌ర్నింగ్ పాయింట్‌గా కొత్త మ‌లుపు నిలుస్తుంద‌నే న‌మ్మ‌క‌ముంది. క‌థ‌ను న‌మ్మి మేము చేసిన ఈ చిన్న ప్ర‌య‌త్నానికి మైత్రీ మూవీ మేక‌ర్స్ అండ‌గా నిల‌వ‌డం ఆనందంగా ఉంద‌ని" చెప్పారు. ఈ సినిమాలో రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు.ఆకాష్ హీరోగా న‌టిస్తోన్న సెకండ్ మూవీ ఇది. 2024లో వ‌చ్చిన స‌ర్కారు నౌక‌రీ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కే రాఘ‌వేంద్ర‌రావు నిర్మించిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా ఫెయిల్యూర్‌గా నిలిచిన ఆకాష్ న‌టుడిగా ఆకాష్ ఆక‌ట్టుకున్నారు.

Advertisement
Advertisement