Rajinikanth Birthday | రజనీకాంత్ కథ, స్క్రీన్‌ప్లే, ప్రొడ్యూసర్‌గా వచ్చిన తెలుగు మూవీ – అయినా డిజాస్టర్
Rajinikanth Birthday | రజనీకాంత్ తెలుగులో ఓ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అంతే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే ఇందులో నటించారు. కానీ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది.
Entertainment | Published On Dec 12, 2025, 11.57 am IST
రజనీకాంత్
Rajinikanth Birthday | దక్షిణాది చిత్రసీమలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో రజనీకాంత్ (Rajinikanth) ఒకరు. సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని మొదలుపెట్టి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. రజనీకాంత్...స్క్రీన్‌పై కనిపిస్తే చాలా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఈ బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అంటూ రజనీకాంత్ చెప్పిన డైలాగ్స్ థియేటర్లు దద్దరిల్లిపోయాయి. రజనీకాంత్ స్టైల్, స్వాగ్, మ్యానరిజమ్స్‌కు సఫరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బ్లాక్‌బస్టర్స్ అందుకున్న హీరోగా రజనీకాంత్ నిలిచారు.
కోలీవుడ్‌లో సూపర్‌స్టార్‌గా కొనసాగుతోన్న రజనీకాంత్ తెలుగులో చాలానే సినిమాలు చేశాడు. సోలోహీరోగానే కాకుండా ఎన్టీఆర్, శోభన్‌బాబు, చిరంజీవి వంటి స్టార్స్‌తో కలిసి నటించాడు. హీరోగానే కాకుండా రజనీకాంత్ తెలుగులో ఓ సినిమా కథ, స్క్రీన్‌ప్లేను కూడా అందించాడు. అంతే కాకుండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే ఇందులో నటించాడు. ఆ సినిమానే విజయ. రజనీకాంత్ ప్రాణ స్నేహితుడు కే నటరాజ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో ప్రియా రామన్ హీరోయిన్‌గా నటించింది. ఇందులో వీరయ్య అనే పాత్రలో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించారు. విజయ మూవీకి కథ, డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, ప్రొడ్యూసర్...అన్ని ప్రధాన బాధ్యతలను రజనీకాంత్ చేపట్టారు. కమర్షియల్‌గా ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. అయితే విజయ స్ట్రెయిట్ తెలుగు మూవీ కాదు. తమిళంలో రూపొందిన వల్లి సినిమాకు డబ్బింగ్‌గా తెలుగులో రిలీజైంది.
వల్లి సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని రజనీకాంత్ అనుకున్నారు. గెస్ట్ రోల్ కోసం చిరంజీవిని సంప్రదించారు. రజనీకాంత్ మీద అభిమానంతో చిరంజీవి కూడా ఈరీమేక్‌లో నటించడానికి అంగీకరించారు. కానీ తమిళంలో ఈ మూవీ ఫెయిలవ్వడంతో రీమేక్ ప్రయత్నాలను పక్కనపెట్టారు రజనీకాంత్. వల్లి తర్వాత వచ్చిన నరసింహా సినిమాకు కూడా రజనీకాంత్ కథను అందించారు. కానీ రైటర్‌గా తన పేరు టైటిల్స్‌లో వేసుకోలేదు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



