త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raja Saab Collections | అఫీషియ‌ల్‌: రాజాసాబ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే? – మిక్స్‌డ్ టాక్‌తో కుమ్మేసిన రెబెల్‌స్టార్ మూవీ

ప్ర‌భాస్ రాజాసాబ్ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో అద‌ర‌గొట్టింది. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ హార‌ర్ కామెడీ మూవీ 112 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Jan 10, 2026, 2.57 pm IST

Raja Saab Collections | అఫీషియ‌ల్‌: రాజాసాబ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతంటే? – మిక్స్‌డ్ టాక్‌తో కుమ్మేసిన రెబెల్‌స్టార్ మూవీ
Advertisement

Raja Saab Collections | ప్ర‌భాస్ రాజాసాబ్ మూవీ మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొట్టింది. ఈ హార‌ర్ కామెడీ మూవీ భారీ అంచ‌నాల న‌డుమ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మూడేళ్ల పాటు షూటింగ్‌ను జ‌రుపుకున్న ఈ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప్ర‌భాస్‌కు ఉన్న పాన్ ఇండియ‌న్ క్రేజ్ మూలంగా రాజాసాబ్ కోసం అన్ని భాష‌ల ఆడియెన్స్ ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రీచ్ కావ‌డంలో మాత్రం రాజాసాబ్ విఫ‌ల‌మైంది. ప్రీమియ‌ర్స్ షోస్ నుంచే ప్ర‌భాస్ సినిమా దారుణ‌మైన నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది.
అయితే ఈ మిక్స్‌డ్‌ టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజు రాజాసాబ్ వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. శుక్ర‌వారం రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ 112 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ సాధించిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. హార‌ర్ ఫాంట‌సీ సినిమాల్లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన ఇండియ‌న్ సినిమాగా రాజాసాబ్ నిలిచింద‌ని పేర్కొన్నారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

పర్మిషన్స్ ఆలస్యం...

నైజాంలో ప్రీమియ‌ర్స్ షోస్‌కు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం, బుకింగ్స్ ఆల‌స్యంగా ఓపెన్ కావ‌డం వ‌ల్ల క‌లెక్ష‌న్స్ త‌గ్గాయ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నారు. లేదంటే రాజాసాబ్ 150కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించి ఉండేద‌ని అంటున్నారు. నైజాంలో ఫ‌స్ట్ డే ప్ర‌భాస్ మూవీ 22 కోట్ల వ‌ర‌కు గ్రాస్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు తెలిపింది. సీడెడ్‌లో ఎనిమిది కోట్ల వ‌ర‌కు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. టోట‌ల్‌గా తెలుగు వెర్ష‌న్ 58 కోట్ల మేర క‌లెక్ష‌న్స్‌ను సొంతం చేసుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.  హిందీలో ప‌ర్వాలేద‌నిపించిన ఈ మూవీ త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డంలో మాత్రం మేక‌ర్స్‌కు గ‌ట్టిషాక్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

 నెగెటివ్ కామెంట్స్...

నెగెటివ్ టాక్ కార‌ణంగా ఫ‌స్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే క‌లెక్ష‌న్స్ త‌గ్గే అవ‌కాశం క‌నిపిస్తోంది. రాజాసాబ్ మూవీ కాన్సెప్ట్ కొత్త‌గా ఉన్న మారుతి ఎగ్జిక్యూష‌న్ మాత్రం బాగాలేద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రొటీన్ స్క్రీన్‌ప్లే, హీరోయిన్ల క్యారెక్ట‌రైజేష‌న్లు స‌రిగ్గా లేవ‌ని అంటున్నారు. లెంగ్త్ ఎక్కువైంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతే కాకుండా ప్ర‌భాస్ లుక్‌తో అత‌డి కామెడీ టైమింగ్ స‌రిగ్గా వ‌ర్క‌వుట్ కాలేద‌ని అంటున్నారు.
ఈ విమ‌ర్శ‌ల‌పై మారుతి శ‌నివారం జ‌రిగిన థాంక్స్ మీట్‌లో మారుతి రియాక్ట్ అయ్యారు. కొత్త క‌థ‌ల కోసం ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఆడియెన్స్‌కు రీచ్ కావ‌డానికి టైమ్ ప‌డుతుంద‌ని అన్నారు.
రాజాసాబ్ మూవీలో ప్ర‌భాస్‌కు జోడీగా మాళ‌వికా మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్ది కుమార్ హీరోయిన్లుగా న‌టించారు. సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ సినిమాను నిర్మించారు. రాజాసాబ్ కు సీక్వెల్ రాబోతుంది. ద రాజాసాబ్ సర్కస్ 1935 పేరుతో సీక్వెల్ ను రూపొందించబోతున్నట్లు ప్రకటించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement