Rahul Ramakrishna | మీ అభిమానిగా అడుగుతున్నా.. ఆ సమాచారాన్ని వెల్లడిస్తారా..? పవన్ లక్ష్యంగా రాహుల్ రామకృష్ణ ట్వీట్..
Rahul Ramakrishna | మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా..? అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్‌ను ప్రశ్నిస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు.
Rahul Ramakrishna | హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘తెలంగాణ మీ అయ్య జాగీరా ’ అంటూ ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు పవన్‌ను లక్ష్యంగా చేసుకొని ఎక్స్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ సహా పలువురు పవన్ ప్రకటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో నటుడు పవన్‌ను లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేశారు.
మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా..? అంటూ పవన్‌ను ప్రశ్నిస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) ఎక్స్‌లో వరుస పోస్టులు పెట్టారు. పీఈఎస్ఏ, 1/70 చట్టం, గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను చూపించాలని కోరారు. 'పీఈఎస్ఏ, 1/70 చట్టం, గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను చూపించండి. అటవీకరణ కార్యక్రమాలు మీరు చేశారా? ఓ స్వతంత్ర సంస్థ కన్ఫర్మ్ చేసిన లెక్కల ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసి గుర్తించిన ఫలితాలను అడుగుతున్నా. నేను మీ అభిమానిగా అడుగుతున్నా.. ప్రశ్నలకు నిరంతరం సమాధానం చెప్పాలి. ప్రశ్నించినందుకు నేను దేశద్రోహిని కాదు. జై తెలంగాణ' అంటూ రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Apart from your usual bravado, have you implemented section 4.1(b) of proactive disclosure of the Right To Information Act in every department of every position you hold sir?
I’m asking because I’m you’re fan and you need to constantly answer our questions
— Rahul Ramakrishna (@eyrahul) June 7, 2026
Also Read..
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఊహించని ప్రమాదం.. విమానాలను ఢీ కొన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు
‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్
పెద్ది సక్సెస్ మీట్‌కు ముహూర్తం ఫిక్స్ - అందరి ఫోకస్ అచ్చియమ్మపైనే ...
తాజావార్తలు
- ●Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌కు ముహూర్తం ఫిక్స్ - అందరి ఫోకస్ అచ్చియమ్మపైనే ...
- ●Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఊహించని ప్రమాదం.. విమానాలను ఢీ కొన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు
- ●Pralhad Joshi | పెంపు అనివార్యం.. ఎల్పీజీ సిలిండర్ ధరలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
- ●Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన..
- ●INDIA bloc meet | ‘ఇండీ’ కూటమి సమావేశానికి టీవీకేకి అందని ఆహ్వానం.. కారణం చెప్పిన కాంగ్రెస్
- ●EPFO | ఈపీఎఫ్‌వో 3.0లో భారీ మార్పులు.. సభ్యులకు అనేక సదుపాయాలు..

Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌కు ముహూర్తం ఫిక్స్ - అందరి ఫోకస్ అచ్చియమ్మపైనే ...

Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఊహించని ప్రమాదం.. విమానాలను ఢీ కొన్న గ్రౌండ్ సర్వీస్ వాహనాలు

Pralhad Joshi | పెంపు అనివార్యం.. ఎల్పీజీ సిలిండర్ ధరలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

Gold And Silver Prices Today | భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఆందోళన..






