RS Praveen Kumar | ఎస్సీలు పంచె కట్టొద్దా..? డిప్యూటీ సీఎం కావొద్దా?: ఆర్ఎస్ ప్రవీణ్
RS Praveen Kumar | గోసి పెట్టుకున్న వాళ్లంతా వైఎస్ఆర్‌లా కాలేరని సీఎం రేవంత్ రెడ్డి అనడంతో భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఎస్సీలు పంచె కట్టుకోవద్దా? డప్యూటీ సీఎం కావొద్దా అని ప్రశ్నించారు.
- రేవంత్ మాటలకు భట్టీ ఏడుస్తుండు
- సెక్రెటేరియట్‌లో కూర్చున్నోళ్లంతా కేసీఆర్ కాలేరు
- తెలంగాణను దోచుకోవడానికి మోదీ, బాబు ప్రయత్నం చేస్తున్నరు
- పవన్‌ను తీసుకొచ్చిందెవరు?
- ప్రజలు అబ్ కి బార్ బీఆర్ఎస్ సర్కార్ అంటున్నరు
- మీడియా సమావేశంలో ఆర్ఎస్పీ ప్రవీణ్‌కుమార్ ఫైర్
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: గోసి పెట్టుకున్న వాళ్లంతా వైఎస్ఆర్‌లా కాలేరని సీఎం రేవంత్ రెడ్డి అనడంతో భట్టి విక్రమార్క ప్రజా భవన్‌లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. యాదాద్రిలో కూడా భట్టిని కింద కూర్చోబెట్టి అవమానించారన్నారు. ఎస్సీలు పంచె కట్టుకోవద్దా? డప్యూటీ సీఎం కావొద్దా అని ప్రశ్నించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. సెక్రటేరియట్‌లో కూర్చున్న వారంతా కేసీఆర్ కాలేరని ఎద్దేవా చేశారు. కేసీఆర్ విజనరీ లీడర్ అయితే రేవంత్ మిషనరీ లీడర్ అని విమర్శించారు.
గెలిచి చూపించు..
సీఎం రేవంత్ రెడ్డి 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక ప్రతి మీటింగ్ ఖర్చు రూ. 15 కోట్లు. రేవంత్ రెడ్డి తన సహచర మంత్రులను దెప్పి పొడుస్తున్నారు. సీఎం కోసం ప్రభుత్వ అధికారులు త్యాగం చేస్తారు. సీఎం కుటుంబ సభ్యులు కమీషన్లు తీసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచి చూపించాలి. ప్రజలు అంతా అబ్ కి బార్ బీఆర్ఎస్ సర్కార్ అంటున్నారు అని ఆర్ఎస్పీ చెప్పారు.
సినిమాలు చూస్తూ జిల్లాల పర్యటనకు పోతుండు..
రేవంత్ రెడ్డి సినిమాలు చూసి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా గంజాయి ఏరులై పారుతోంది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారు. ఎస్.ఎల్.బి.సిలో చనిపోయిన 8 మంది శవాలను తీసుకురండి. కాంగ్రెస్ వల్లే పాలమూరు ఎడారిగా మారింది. ఎక్కడ చర్చ చేద్దామో రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి అని ప్రవీణ్ సవాల్ విసిరారు.
ఈరోజే ఆదిత్యనాథ్‌ను టెర్మినేట్ చేయాలి..
ఆదిత్యనాథ్ దాస్‌ను ఇరిగేషన్ సలహాదారుగా ఎందుకు పెట్టారు. గ్రీకులో ట్రాయ్ నగరాన్ని ధ్వంసం చేసినట్లు చంద్రబాబు నాయుడు, మోదీ లాంటి వారి అండతో తెలంగాణను రేవంత్ రెడ్డి నాశనం చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు ఆలోచనలు రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో అమలవుతున్నాయి. ఆదిత్యనాథ్ దాస్‌ను ఈరోజే రేవంత్ రెడ్డి టెర్మినేట్ చేయాలి అని డిమాండ్ చేశారు.
పవన్‌ను తెలంగాణకు తీసుకొచ్చిందెవరు?
హరిహర వీరమల్లు సినిమా టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు. పవన్ కళ్యాణ్‌ను తెలంగాణకు తీసుకువచ్చింది ఎవరు? డి.కె.శివకుమార్‌కు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి మాట్లాడతారా..? కర్నాటకలో వాల్మీకి కార్పొరేషన్ నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణకు ఫండ్ వచ్చింది. తెలంగాణ సంపదను నరేంద్ర మోడీ, చంద్రబాబు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
వాపును చూసి బలుపు అనుకుంటున్నడు: జైపాల్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే
రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తే సమస్యలు ఎలా తెలుస్తాయి? తన గొప్పలు తానే చెప్పుకుంటున్నారు. 30 నెలల తర్వాత పాలమూరు గుర్తుకు వచ్చింది. రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నారు. అహంకారమే ఆయన్ని దెబ్బతీస్తుంది. వాపును చూసి బలుపు అనుకుంటున్నారు. కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది. పాలమూరును కేసీఆర్ అభివృద్ధి చేశారు.
సంబంధిత వార్తలు

HYDRAA | హిట్లర్ ఇన్స్పిరేషన్గా ‘హైడ్రా’.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జూన్ 6, 2026

Eatala Rajendar | పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు కీలకం: ఈటల రాజేందర్
జూన్ 6, 2026

CM Revanth Reddy | ప్రజల కలను సాకారం చేసినందుకే కాంగ్రెస్‌లో చేరా.. ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి
జూన్ 6, 2026
తాజావార్తలు
- ●HYDRAA | హిట్లర్ ఇన్స్పిరేషన్గా 'హైడ్రా'.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
- ●Eatala Rajendar | పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు కీలకం: ఈటల రాజేందర్
- ●CM Revanth Reddy | ప్రజల కలను సాకారం చేసినందుకే కాంగ్రెస్‌లో చేరా.. ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి
- ●Minister Vakiti Srihari | చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు: మంత్రి వాకిటి శ్రీహరి
- ●Bigg Boss Divi | బిగ్‌బాస్ దివి వర్కవుట్ ఫొటోలు చూశారా
- ●TGPSC | డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ పోస్టులకు అర్హత ఇదే.. టీజీపీఎస్సీ స్పష్టత

HYDRAA | హిట్లర్ ఇన్స్పిరేషన్గా 'హైడ్రా'.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Eatala Rajendar | పార్టీ బలోపేతానికి శిక్షణా కార్యక్రమాలు కీలకం: ఈటల రాజేందర్

CM Revanth Reddy | ప్రజల కలను సాకారం చేసినందుకే కాంగ్రెస్‌లో చేరా.. ది హిందూ గ్రూప్ డైరెక్టర్ ఎన్ రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి

Minister Vakiti Srihari | చేప ప్రసాదం పంపిణీకి విస్తృత ఏర్పాట్లు: మంత్రి వాకిటి శ్రీహరి



