Janhvi Kapoor | పెద్ది సక్సెస్ మీట్‌కు ముహూర్తం ఫిక్స్ – అందరి ఫోకస్ అచ్చియమ్మపైనే …
పెద్దిలో జాన్వీ కపూర్ రోల్ వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం హైదరాబాద్‌లో పెద్ది సక్సెస్ సెలబ్రేషన్స్ వేడుక జరుగనుంది. ఈ వివాదం నడుమ ఈ సక్సెస్ మీట్‌కు జాన్వీ కపూర్ అటెండ్ అవుతుందా? లేదా? అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Jun 8, 2026, 11.43 am IST
Janhvi Kapoor | పెద్ది వివాదం టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. జాన్వీ కపూర్ పాత్రను గ్లామర్ డాల్‌గా చూపించడంపై దర్శకుడు బుచ్చిబాబు సానాను నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతితో పాటు పలువురు హీరోయిన్లు కూడా ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. కథానాయికలు అంటే అందాల ప్రదర్శన కోసమేనని దర్శకులు ఆలోచించే తీరు మారాలని కామెంట్లు చేశారు. ఈ వివాదంపై ట్రోల్స్, విమర్శలు ఎక్కువైపోవడంతో బుచ్చిబాబు సానా క్షమాపణలు చెప్పారు. జాన్వీ సీన్లలో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా తన పాత్రకు సంబంధించి వస్తోన్న విమర్శలపై మాత్రం జాన్వీ ఇప్పటివరకు అఫీషియల్‌గా రియాక్ట్ కాలేదు.
సక్సెస్ సెలబ్రేషన్స్....
కాగా పెద్ది సక్సెస్ సెలబ్రేషన్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరుగనుంది. ఈ వేడుకలో టీమ్ అందరూ పాల్గొనబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సక్సెస్ మీట్‌కు జాన్వీ కపూర్ వస్తుందా? లేదా? అన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జాన్వీ వస్తే ఏం మాట్లాడుతుంది? ఈ వివాదంపై ఎలా రియాక్ట్ అవుతుంది? దర్శకుడి గురించి ఏం చెబుతుంది అన్నది ఉత్కంఠగా మారింది. జాన్వీ పాత్రపై వస్తోన్న విమర్శలపై రామ్ చరణ్ కూడా రియాక్ట్ అవుతాడా? మిగిలిన టీమ్ కూడా ఏం చెబుతారనే దాని కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
హర్ట్ అయ్యిందా?
రిలీజ్‌కు ముందు జరిగిన ప్రమోషన్స్‌లో రౌడీ డైరెక్టర్, టాలీవుడ్ క్రిస్టఫర్ నోలన్ అంటూ బుచ్చిబాబుపై తెగ పొగడ్తలు కురిపించింది జాన్వీ. రిలీజ్ తర్వాత మాత్రం సోషల్ మీడియాలో సినిమాతో పాటు దర్శకుడిని ఉద్దేశించి ఎలాంటి పోస్ట్‌లు, ట్వీట్స్ చేయలేదు. క్యారెక్టర్ విషయంలో వచ్చిన విమర్శల కారణంగా జాన్వీ హర్ట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది అందుకే రిలీజ్ తర్వాత ప్రమోషన్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని చెబుతున్నారు. సక్సెస్ మీట్‌కు కూడా అటెండ్ కావడం అనుమానమేనని ప్రచారం జరుగుతోంది.
ఫోకస్ అచ్చియమ్మనే...
ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా జాన్వీ కపూర్‌కు సారీ చెప్పిన బుచ్చిబాబు...మరోసారి ఈ సక్సెస్ మీట్‌లో అభిమానుల అందరి ముందు క్షమాపణలు చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సక్సెస్ మీట్‌లో అందరి ఫోకస్ అచ్చియమ్మపైనే ఉంది.
స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన పెద్ది మూవీ నాలుగు రోజుల్లో 290 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. తన ఊరికి కష్టాలను తీర్చడం కోసం ఓ క్రాస్ ఓవర్ అథ్లెట్ సాగించిన పోరాటం నేపథ్యంలో బుచ్చిబాబు సానా ఈ సినిమాను తెరకెక్కించారు.
సంబంధిత వార్తలు

Suriya | తెలుగు సింగర్‌గా హీరో సూర్య – విశ్వనాథ్ అండ్ సన్స్ వెడ్డింగ్ సాంగ్ రిలీజ్
జులై 25, 2026

Tamannaah | హీరోయిన్లను గ్లామర్ డాల్స్‌లా చూస్తారు – సౌత్ ఇండస్ట్రీపై తమన్నా కామెంట్లు
జులై 25, 2026

Shruti Haasan | ఆ ప్రశ్న అడగొద్దు – పెళ్లిపై శృతి హాసన్ సీరియస్ కామెంట్స్ – నెటిజన్‌కు వార్నింగ్
జులై 24, 2026
తాజావార్తలు
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!

Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు

Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!



