Mahaveer Karna | కర్ణుడిగా లారెన్స్ – 150 కోట్లతో తెలుగు డైరెక్టర్ తమిళ మైథాలజీ మూవీ
తెలుగు రమేష్ వర్మ తమిళ హీరో రాఘవ లారెన్స్‌తో ఓ మైథాలజీ మూవీ చేయబోతున్నాడు. మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మహావీర్ కర్ణ అనే టైటిల్ ఖరారు చేశారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కుతోంది.
Entertainment | Published On Sep 22, 2026, 1.46 pm IST
Mahaveer Karna | పాన్ ఇండియన్ కల్చర్‌తో సినిమాల పరంగా భాషాపరమైన హద్దులు తొలగిపోయాయి. కోలీవుడ్ దర్శకులు తెలుగులో సినిమాలు చేస్తున్నారు. తెలుగు డైరెక్టర్లు తమిళంలో ఛాన్స్‌లు దక్కించుకుంటున్నారు. వెంకీ అట్లూరి, వంశీపైడిపల్లితో పాటు పలువురు తెలుగు దర్శకులు తమిళంలో స్టార్ హీరోలతో సినిమాలు చేసి విజయాలను అందుకున్నారు. ఈ జాబితాలో మరో దర్శకుడు చేరబోతున్నారు. ఖిలాడీ, రాక్షసుడు, రైడ్ సినిమాల ఫేమ్ రమేష్ వర్మ తమిళంలో ఓ మైథాలజీ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మంగళవారం రిలీజ్ చేశారు.
కర్ణుడి పాత్ర ఆధారంగా...
మహాభారతంలోని కర్ణుడి పాత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మహావీర్ కర్ణ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కర్ణుడిగా టైటిల్ పాత్రలో రాఘవ లారెన్స్ నటిస్తున్నారు. మంగళవారం రిలీజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో నుదుటిపై సూర్యతిలకంతో రౌద్రంగా లారెన్స్ కనిపిస్తున్నారు.
150 కోట్ల బడ్జెట్...
హైబ్రీడ్ లైవ్ యాక్షన్ ఫార్మెట్‌లో దాదాపు 150 కోట్లతో మహావీర్ కర్ణ మూవీ రూపొందుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, పీరియాడికల్ సెట్స్‌తో పాటు గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ హంగులతో ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైథాలజీ జానర్‌లో లారెన్స్ నటిస్తోన్న ఫస్ట్ మూవీ. వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటులు ఈ మైథాలజీ మూవీలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
బెంజ్...కాంచన...
ప్రస్తుతం బెంజ్, కాంచన 2 సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు లారెన్స్. మరోవైపు ఒక ఊరిలో సినిమాతో డైరెక్టర్‌గా రమేష్ వర్మ జర్నీ మొదలైంది. రైడ్, వీర, అమ్మాయితో అబ్బాయి, రాక్షసుడు, ఖిలాడీ సినిమాలకు దర్శకత్వం వహించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు – బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్
సెప్టెంబర్ 22, 2026

Krithi Shetty | జనవరి 12 విడుదల సెట్స్‌లో కృతిశెట్టి బర్త్‌డే సెలబ్రేషన్స్
సెప్టెంబర్ 21, 2026

Allu Arjun | గిన్నిస్ బుక్‌లో రాకా – రికార్డ్ సర్టిఫికేట్ అందుకున్న అల్లు అర్జున్
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు
- ●KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం
- ●Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం
- ●Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు
- ●MLA Premsagar Rao | వట్టిగ కాలేసి తొక్కితే సచ్చిపోతరు బిడ్డా.. మళ్లోసారి వార్నింగ్ ఇస్తున్నా
- ●Chiranjeevi | సినిమాలతో కోట్లు సంపాదిస్తున్నా.. అది చాలు - బ్లడ్ అమ్ముకుంటున్నారంటూ ఆరోపణలపై చిరంజీవి రియాక్షన్

BJP Ramchandar Rao | మమ్మల్ని ఆపితే రైతుల ఉద్యమం ఆగదు

KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం వల్లే రిమ్స్‌లో అగ్నిప్రమాదం

Hardeep Singh Puri | దేశంలో ఎల్పీజీ కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు : కేంద్రం

Vande Mataram Supreme Court | వందేమాతరం పాడకపోతే క్రిమినల్ నేరమా? కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం కోర్టు



