OTT | ఆరు కోట్ల బడ్జెట్ – 75 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ
కోలీవుడ్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ తాయ్ కిళవి ఓటీటీలోకి రాబోతుంది. రాధికా శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన జియో హాట్‌స్టార్ మూవీ ఏప్రిల్ నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిన్న సినిమాను కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించారు.
Entertainment | Published On Mar 30, 2026, 8.44 pm IST
OTT | కోలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయాన్ని సాధించింది తాయ్ కిళవి. కేవలం ఆరు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 75 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. రాధికా శరత్‌కుమార్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో సింగంపులి, అరుళ్‌దాస్, మునీష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిన్న సినిమాను కోలీవుడ్ అగ్ర హీరో శివకార్తికేయన్ నిర్మించారు.
తాయ్ కిళవి ఓటీటీలో...
థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన తాయ్ కిళవి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్ 10 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఓ వీడియో ద్వారా రిలీజ్ డేట్‌ను జియో హాట్‌స్టార్ అఫీషియల్‌గా ప్రకటించింది. తాయ్ కిళవి మూవీలో రాధికా శరత్‌కుమార్ అసమాన నటనతో ఆకట్టుకున్నది. వృద్దురాలి పాత్ర కోసం ఆమె మేకోవర్ అయిన తీరుకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. రాధిక కెరీర్‌లోనే బెస్ట్ సినిమాల్లో ఒకటిగా తాయ్ కిళవి నిలిచింది. కమల్‌హాసన్‌తో పాటు పలువురు దిగ్గజ నటులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
వడ్డీ వ్యాపారి....
కడుపట్టి గ్రామానికి చెందిన పవునుత్తాయి వడ్డీ వ్యాపారం చేస్తుంటుంది. ఊరు మొత్తం ఆమెను చూసి వణికిపోతుంటారు. వడ్డీ డబ్బుల విషయంలో నిక్కచ్చిగా ఉంటుంది. ఆమె నోటికి భయపడి ముగ్గురు కొడుకులు వేరే ఊళ్లలో సెటిలవుతారు. పవునుత్తాయికి పక్షవాతం వస్తుంది. మంచంపై పడ్డ ఆమెను చూడటానికి దూరంగా ఉన్న ముగ్గురు కొడుకులు వస్తారు. పవునుత్తాయి వద్ద ఉన్న బంగారు నగలను దక్కించుకోవడానికి ముగ్గురు రకరకాల ప్లాన్ వేస్తారు? ఆ తర్వాత ఏమైంది? ఊరివాళ్లంతా పవునుత్తాయికి ఎలా అండగా నిలబడ్డారు? ముగ్గురు కొడుకులకు పవునుత్తాయి ఎలా బుద్ది చెప్పింది అన్నదే ఈ మూవీ కథ.
సంబంధిత వార్తలు

Trisha | సూర్య, త్రిష మధ్య విభేదాలు? – చెన్నై క్వీన్‌ను అవమానించారంటూ ఫ్యాన్స్ ఫైర్
మే 18, 2026

Comedy OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ – సినిమా మొత్తం విమానంలోనే!
మే 17, 2026

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



