OTT | ఓటీటీలోకి కన్నడ యాక్షన్ మూవీ – హీరోయిన్‌గా కూలీ విలన్ – తెలుగులోనూ రిలీజ్
కూలీ మూవీ ఫేమ్ రచితారామ్ హీరోయిన్‌గా నటించిన కన్నడ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లాండ్‌లార్డ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. మార్చి 19 నుంచి జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ కన్నడ మూవీలో దునియా విజయ్ హీరోగా నటించాడు.
Entertainment | Published On Mar 14, 2026, 9.04 pm IST
OTT | దునియా విజయ్ హీరోగా నటించిన కన్నడ మూవీ లాండ్‌లార్డ్ విభిన్నమైన ప్రయత్నంగా ప్రేక్షకులను మెప్పించింది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో రచితా రామ్ హీరోయిన్‌గా నటించింది. రాజ్ బీ శెట్టి విలన్‌గా కనిపించాడు. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది.
తెలుగులో రిలీజ్...
లాండ్‌లార్డ్ మార్చి 19 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. కన్నడంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతోంది.ఈ సినిమాలో దునియా విజయ్ కూతురు రితన్యా విజయ్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతోనే శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
భూస్వామ్య వ్యవస్థ కారణంగా...
1980 దశకంలో కర్ణాటకలో భూస్వామ్య వ్యవస్థ కారణంగా పేదలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొనేవారనే పాయింట్‌తో దర్శకుడు జదేశ్ కే హంపి ఈ సినిమాను తెరకెక్కించారు. రాచయ్య (దునియా విజయ్) కూలీగా పనిచేస్తుంటాడు. సొంతంగా భూమి కొనుక్కోవాలని ఆశపడతాడు. ఆ ఊరిని సన్నధని (రాజ్ బి. శెట్టి) భూస్వామి ఏలుతుంటాడు. పేదల భూములతో పాటు వారి కష్టాన్ని దోచుకుంటాడు. సన్నధని అక్రమాలపై రాచయ్య ఎలా ఎదురుతిరిగాడు? పోలీస్ కానిస్టేబుల్ భాగ్య (రితన్యా విజయ్)కు రాచయ్యకు ఉన్న సంబంధమేమిటి? అన్నదే ఈ మూవీ కథ.
వీరసింహారెడ్డి మూవీలో...
లాండ్‌లార్డ్ మూవీకి అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందించాడు. దునియా విజయ్, రచితారామ్‌తో పాటు రాజ్‌బీ శెట్టి యాక్టింగ్ బాగున్నా కమర్షియల్‌గా మాత్రం ఈ మూవీ విజయాన్ని సాధించలేదు. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 12 కోట్లలోపే వసూళ్లను దక్కించుకుంది. దునియా విజయ్ తెలుగులో బాలకృష్ణ వీరసింహారెడ్డి మూవీలో విలన్‌గా నటించాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్‌లో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rachita Ram | హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని – పబ్లిక్‌గా ఇదేం పని అంటూ నెటిజన్ల ఫైర్
అక్టోబర్ 3, 2026

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ – మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
జూన్ 6, 2026

Rachita Ram | సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు – బాడీ షేమింగ్‌పై కూలీ హీరోయిన్ కామెంట్స్
జనవరి 24, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క
- ●Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్
- ●Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య
- ●Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
- ●Bus Accident | అనంతగిరి వద్ద లోయలో పడిన బస్సు.. నలుగురు మృతి

Bhatti Vikramarka | ప్రయాణికుల సౌకర్యమే లక్ష్యంగా ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్: భట్టి విక్రమార్క

Amit Shah | డ్రగ్స్‌పై ఉక్కుపాదంలో భద్రతా బలగాలకు చారిత్మాతక విజయం.. నవప్రీత్ సింగ్ భారత్‌కు డిపోర్ట్

Farmer Suicide | భూ సమస్యకు దొరకని పరిష్కారం.. తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రైతు ఆత్మహత్య

Jason Sanjay | సిగ్మా ఫస్ట్ డే కలెక్షన్స్ - తెల్లకాగితం కంటే దళపతి విజయ్ కొడుకు మూవీకి తక్కువ వసూళ్లు



