త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | న‌య‌న‌తార వ‌ర్సెస్ సాయిప‌ల్ల‌వి – రామాయ‌ణ‌కు పోటీగా మ‌హాశ‌క్తి

సాయిప‌ల్ల‌వి రామాయ‌ణ మూవీకి పోటీగా తెలుగులో మ‌రో భ‌క్తి సినిమా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న మ‌హాశ‌క్తి మూవీ న‌వంబ‌ర్ 6న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ బుధ‌వారం రిలీజ్ చేశారు. ఇందులో అమ్మ‌వారిగా, పోలీస్ ఆఫీస‌ర్‌గా డ్యూయ‌ల్ రోల్‌లో న‌య‌న‌తార క‌నిపిస్తోంది.

N

Entertainment | Published On Oct 21, 2026, 2.37 pm IST

Nayanthara | న‌య‌న‌తార వ‌ర్సెస్ సాయిప‌ల్ల‌వి – రామాయ‌ణ‌కు పోటీగా మ‌హాశ‌క్తి
Advertisement

Nayanthara |  ఈ దీపావ‌ళికి బాక్సాఫీస్ వ‌ద్ద భ‌క్తి సినిమాల‌తో స్టార్ హీరోయిన్లు న‌య‌న‌తార‌, సాయిప‌ల్ల‌వి పోటీప‌డ‌బోతున్నారు. సాయిప‌ల్ల‌వి రామాయ‌ణ‌కు పోటీగా న‌య‌న‌తార మ‌హాశ‌క్తి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న మ‌హాశ‌క్తి మూవీకి సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. న‌వంబ‌ర్ 6న తెలుగుతో పాటు త‌మిళంలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

డ్యూయ‌ల్ రోల్‌....

మ‌హాశ‌క్తి ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ బుధ‌వారం రిలీజ్ చేశారు. ఈ భ‌క్తి ప్ర‌ధాన సినిమాలో న‌య‌న‌తార పోలీస్ ఆఫీస‌ర్‌గా, అమ్మ‌వారిగా డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించింది. ప్ర‌పంచ వినాశ‌నం కోసం ప్ర‌య‌త్నాలు చేస్తోన్న దుష్ట‌శ‌క్తుల‌ను ఓ అమ్మ‌వారు ఎలా ఎదురించార‌నే కాన్సెప్ట్‌తో మ‌హాశ‌క్తి రూపొందుతోన్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు. చిన్న విష‌యాల‌కే భ‌య‌ప‌డే పోలీస్‌గా, అమ్మ‌వారిగా రెండు పాత్ర‌ల్లో న‌య‌న‌తార చూపించిన వేరియేష‌న్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది.

విల‌న్ పాత్ర‌లో రెజీనా...

మ‌హాశ‌క్తి సినిమాలో అతీంద్రియ శ‌క్తులు క‌లిగిన విల‌న్ పాత్ర‌లో రెజీనా క‌నిపించ‌బోతుంది. ఆమెతో పాటు క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ నెగెటివ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. ఖ‌ష్బూ, యోగిబాబు, సునీల్‌, ఊర్వ‌శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

సీక్వెల్‌....

త‌మిళంలో సూప‌ర్ హిట్‌గా నిలిచిన మూకుత్తి అమ్మ‌న్ సినిమాకు సీక్వెల్‌గా మ‌హాశ‌క్తి మూవీ రూపొందుతోంది. త‌మిళంలో మూకుత్తి అమ్మ‌న్ 2 పేరుతో రిలీజ్ అవుతోంది.

రామాయ‌ణ‌తో పోటీ....

రామాయ‌ణ‌కు పోటీగా ఈ సినిమా తెలుగు, త‌మిళంలో రిలీజ్ కాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. రెండు భ‌క్తి ప్ర‌ధాన సినిమాలే కావ‌డం, స్టార్ హీరోయిన్లు టైటిల్ పాత్ర‌ల్లో న‌టించ‌నుండ‌టంతో ఈ బాక్సాఫీస్ పోరు ఆస‌క్తిక‌రంగా మారింది. న‌య‌ర‌తార‌కు ఉన్న స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్‌, ఫాలోయింగ్‌ను త‌ట్టుకొని తెలుగు, త‌మిళ భాష‌ల్లో థియేట‌ర్ల వ‌ద్ద‌ సాయిప‌ల్ల‌వి రామాయ‌ణ మూవీ ఎంత వ‌ర‌కు నిల‌బ‌డుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. రామాయ‌ణ మూవీలో సాయిప‌ల్ల‌వి సీత పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. రాముడిగా ర‌ణ‌బీర్‌క‌పూర్ న‌టిస్తోన్న ఈ మూవీలో రావ‌ణాసురుడి పాత్ర‌ను య‌శ్ పోషిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement