Rachita Ram | హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని – పబ్లిక్‌గా ఇదేం పని అంటూ నెటిజన్ల ఫైర్
కన్నడ హీరోయిన్ రచితారామ్‌కు ఓ అభిమాని షాకిచ్చాడు. సెల్ఫీ తీసుకోవడానికంటూ దగ్గరకు వచ్చి ఆమె బుగ్గలు గిల్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమాని తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు.
Entertainment | Published On Oct 3, 2026, 10.52 am IST
Rachita Ram | కన్నడ అగ్ర హీరోయిన్ రచితా రామ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సెల్ఫీ దిగడానికి వచ్చిన అభిమాని ఆమె బుగ్గలు గిల్లాడు. సాండల్‌వుడ్‌లో మోస్ట్ బిజీయోస్ట్ హీరోయిన్‌గా కొనసాగుతోంది రచితారామ్. ఈ ఏడాది ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటించిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. రజనీకాంత్ కూలీలో విలన్ పాత్రలో అదరగొట్టింది. ప్రస్తుతం చిరంజీవి కాకా సినిమాలో నెగెటివ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఫొటోషూట్...
శనివారం రచితారామ్ బర్త్‌డే. తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా అభిమానులను కలుస్తుంటుంది ఈ కన్నడ హీరోయిన్. శనివారం కూడా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన అభిమానులతో ఫొటోషూట్ ఏర్పాటుచేసింది. ఈ ఫొటోషూట్‌లో ఓ అభిమాని ఆమెకు పెద్ద షాకిచ్చాడు. రచితారామ్‌తో ఓ అభిమాని సెల్ఫీ తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా ఆమె రెండు బుగ్గలు గిల్లాడు. అభిమాని ప్రవర్తనతో రచితా రామ్ విస్మయానికి గురైంది. కోపం వచ్చినా... కంట్రోల్ చేసుకుంటూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అనుచిత ప్రవర్తన...
సదరు అభిమాని చేసిన పనిని కొందరు నెటిజన్లు సమర్థిస్తుండగా...చాలా మంది తప్పుపడుతున్నారు. రచితా రామ్‌పై అభిమానంతోనే అతడు ఇలా చేశాడని, అందులో తప్పుపట్టడానికి ఏం లేదని నెటిజన్లు పోస్ట్‌లు పెడుతోన్నారు. రచితా రామ్ సెలిబ్రిటీ అయినా...తను మహిళేనని, ఆమెతో అనుచితంగా ప్రవర్తించడం తప్పేనని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పబ్లిక్‌గా ఇలా చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదని అంటున్నారు.
Bro really pinched Rachitha Ram’s cheeks 😭😂 pic.twitter.com/uLydGpVjDX
— Bujji kanna 😼💖 (@bujji_kannna) October 2, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sharmiela Mandre | ప్రొడ్యూసర్‌ను పెళ్లి చేసుకున్న కెవ్వు కేక హీరోయిన్ – వెడ్డింగ్ ఫొటోలు వైరల్
జులై 19, 2026

Rachita Ram | కూలీ లేడీ విలన్‌కు తెలుగులో ఛాన్స్ – మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీ
జూన్ 6, 2026

OTT | ఓటీటీలోకి కన్నడ యాక్షన్ మూవీ – హీరోయిన్‌గా కూలీ విలన్ – తెలుగులోనూ రిలీజ్
మార్చి 14, 2026
తాజావార్తలు
- ●Nightclub | దారుణం.. పబ్‌లో మహిళను వివస్త్రను చేసి దాడి
- ●Stock Recommendations | బాండ్ల రాబడితో మారిన లెక్కలు.. ఈ 5 స్టాక్స్‌పై ఓ కన్నేయండి..
- ●Chiranjeevi | మీ సాహసం.. ప్రతి భారతీయుడికీ గర్వకారణం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై మెగాస్టార్ ప్రశంసలు
- ●Manali | లాంగ్ వీకెండ్.. మనాలీకి క్యూ కట్టిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
- ●flydubai attacker | ఉగ్రవాద భావజాలం.. విమానాలు నడపడంపై నిషేధం.. ఫ్లైదుబాయ్ కో-పైలట్ గురించి సంచలన విషయాలు
- ●Boiler Blast | హెల్త్‌కేర్ పరిశ్రమలో పేలిన బాయిలర్.. నలుగురు దుర్మరణం

Nightclub | దారుణం.. పబ్‌లో మహిళను వివస్త్రను చేసి దాడి

Stock Recommendations | బాండ్ల రాబడితో మారిన లెక్కలు.. ఈ 5 స్టాక్స్‌పై ఓ కన్నేయండి..

Chiranjeevi | మీ సాహసం.. ప్రతి భారతీయుడికీ గర్వకారణం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై మెగాస్టార్ ప్రశంసలు

Manali | లాంగ్ వీకెండ్.. మనాలీకి క్యూ కట్టిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్



