Raashii Khanna | పదమూడేళ్ల కల నిజమైన వేళ – రాశీఖన్నాకు ఊహించని ఛాన్స్!
రజనీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ధర్మన్ మూవీ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో సిమ్రాన్‌తో పాటు రాశీఖన్నా కీలక పాత్రలో కనిపించబోతున్నది.
Entertainment | Published On Jun 25, 2026, 6.25 pm IST
Raashii Khanna | రాశీఖన్నా సినీ ప్రయాణం మొదలై పదమూడేళ్లు దాటిపోయింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి హీరోయిన్‌గా యాభైకిపైగానే సినిమాలు చేసింది. అద్భుత విజయాలతో దక్షిణాది ప్రేక్షకులను మెప్పించింది. అయినా స్టార్ లీగ్‌లో అడుగుపెట్టలేకపోయింది. రాశీఖన్నా తర్వాత కెరీర్‌ను ఆరంభించిన రష్మిక మందన్న, శ్రీలీలతో పాటు పలువురు ముద్దుగుమ్మలు తక్కువ కాలంలోనే నంబర్ వన్ నాయికలుగా పేరుతెచ్చుకున్నారు. కానీ ఢిల్లీ బ్యూటీకి టాప్ హీరోయిన్ అనే ట్యాగ్ అందని ద్రాక్షగానే మిగిలింది. కొత్త హీరోయిన్లు ఈజీగా అగ్ర హీరోలతో జోడీ కట్టే ఛాన్స్‌లు దక్కించుకుంటున్నారు. రాశీఖన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దం దాటిపోయినా టైర్ 2 హీరోల దగ్గరే ఆగిపోయింది.
రజనీకాంత్ సినిమాలో...
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ రాశీఖన్నా సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకుంది. రజనీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతోన్నతమిళ మూవీ ధర్మన్ అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను విలక్షణ నటుడు కమల్‌హాసన్ నిర్మిస్తోన్నారు. సిమ్రాన్‌తో పాటు రాశీఖన్నా కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
కల నెరవేరింది...
కమల్‌హాసన్, రజనీకాంత్ సినిమాలో భాగం కావడంపై రాశీఖన్నా ఆనందం వ్యక్తం చేసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఒక్క సినిమాతో నెరవేరుతుందని అస్సలు ఊహించలేదని చెప్పింది. గ్లామరస్ హీరోయిన్, బబ్లీ గర్ల్ అనే ఇమేజ్ నుంచి తనను దూరం చేసే సినిమా అవుతుందని, చాలా సర్‌ప్రైజింగ్ రోల్ చేస్తున్నానని రాశీఖన్నా అన్నది.
డిజాస్టర్లతో...
తెలుగు, తమిళ భాషల్లో రాశీఖన్నా హిట్టు అందుకొని చాలా కాలమైంది. అగాథియా, తెలుసు కదాతో పాటు సర్ధార్ గబ్బర్‌సింగ్ డిజాస్టర్స్‌తో ఆమె దక్షిణాది కెరీర్ ముగిసిపోయిందంటూ కొన్నాళ్లుగా పుకార్లు వినిస్తున్నాయి. కొత్త ఆఫర్లు రావడం అనుమానమేనని అంతా అనుకున్నారు. కానీ అందరి ఊహలను తలక్రిందులు చేస్తూ రజనీకాంత్ సినిమాలో రాశీఖన్నాకు అవకాశం దక్కడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం రాశీఖన్నా మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుందట.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●London Climate Action Week 2026 | గ్రీన్ ఇండియా చాలెంజ్ రికార్డ్స్, సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు
- ●Ritika Nayak | రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్
- ●Tungabhadra Dam Gates | మైసూరు రాజులు సైతం రైతుల కోసం యుద్ధాలు పక్కన పెట్టారు.. ఇక మనమెంత?
- ●Inter-State Water Disputes India | తుంగభద్ర వద్ద సీఎంల భేటీ.. కరచాలనాల వెనుక దాగిన 30 జల వివాదాలివే!
- ●Morocco Vs Haiti | 52 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో గోల్స్.. మొరాకోకు చుక్కలు చూపించిన హైతీ, కానీ నాకౌట్‌కు ఎవరంటే?
- ●Banganapalle Mango | సింగపూర్‌కు సముద్ర మార్గంలో తొలి బంగినపల్లి మామిడి ఎగుమతి

London Climate Action Week 2026 | గ్రీన్ ఇండియా చాలెంజ్ రికార్డ్స్, సంతోష్ కుమార్ విజన్‌పై అంతర్జాతీయ నేతల ప్రశంసలు

Ritika Nayak | రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ హీరోయిన్

Tungabhadra Dam Gates | మైసూరు రాజులు సైతం రైతుల కోసం యుద్ధాలు పక్కన పెట్టారు.. ఇక మనమెంత?

Inter-State Water Disputes India | తుంగభద్ర వద్ద సీఎంల భేటీ.. కరచాలనాల వెనుక దాగిన 30 జల వివాదాలివే!





