Raashii Khanna | డ్రగ్ కల్చర్‌పై రాశీఖన్నా వెబ్‌సిరీస్ – పోలీస్ పాత్రలో ఉస్తాద్ హీరోయిన్…
ఓ బాలీవుడ్ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను సైలెంట్‌గా కంప్లీట్ చేసింది రాశీఖన్నా. లుఖే పేరుతో రూపొందుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో రాశీఖన్నా పంజాబీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నది. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యాయి.
Entertainment | Published On Apr 26, 2026, 7.33 pm IST
Raashii Khanna | హీరోయిన్‌గా రాశీఖన్నా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు దాటిపోయింది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో జోడీ కట్టింది. తొలి ప్రేమ, వెంకీమామతో పాటు మరికొన్ని సినిమాలతో పెద్ద విజయాలను అందుకుంది. అయినా హీరోయిన్‌గా టాప్ లీగ్‌లోకి మాత్రం అడుగుపెట్టలేకపోయింది. రెండు, మూడేళ్ల క్రితం తెలుగులో కెరీర్‌ను మొదలుపెట్టిన చాలా మంది కథానాయికలు స్టార్స్‌గా మారారు. రాశీ మాత్రం వెనుకబడిపోయింది. ఇటీవల రిలీజైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌లో సెకండ్ హీరోయిన్‌గా కనిపించింది రాశీఖన్నా. కానీ ఈ ముద్దుగుమ్మకు హిట్టు మాత్రం దక్కలేదు. పరాజయాల కారణంగా తెలుగులో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో గత కొన్నాళ్లుగా హిందీపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది రాశీఖన్నా.
వెబ్‌సిరీస్...
సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు చేస్తోంది. రుద్ర వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత షాహిద్ కపూర్ ఫర్జీ సిరీస్‌లోనూ ఓ డిఫరెంట్ రోల్‌తో ఆకట్టుకుంది. తాజాగా రాశీఖన్నా హిందీలో మరో వెబ్‌సిరీస్ షూటింగ్‌ను సైలెంట్‌గా కంప్లీట్ చేసింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ కన్ఫామ్ అయ్యారు. లుఖే పేరుతో రూపొందుతోన్న ఈ సిరీస్ మే 8న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతుంది. ఇందులో రాశీఖన్నాతో పాటు బాలీవుడ్ సింగర్ కింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
పోలీస్ ఆఫీసర్‌గా...
లుఖేకు హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించాడు. ఛండీఘడ్‌లోని ర్యాప్, డ్రగ్ కల్చర్, వీధి గొడవల నేపథ్యంలో ఈ సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఇందులో పంజాబీ పోలీస్ ఆఫీసర్‌గా రాశీఖన్నా రోల్ పవర్‌ఫుల్‌గా సాగుతుందట. పాలక్ తివారీ, లక్ష్యవీర్ సింగ్, శివాంకిత్ పరిహార్, యోగ్‌రాజ్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
రీమేక్‌లో...
లుఖే వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రాశీఖన్నా అఫీషియల్‌గా వెల్లడించింది. టైటిల్‌తో కూడిన ఓ టీషర్ట్ ధరించిన ఫొటోలను పోస్ట్ చేసింది.
ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్‌లో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ రీమేక్‌లో అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తోన్నాడు.
సంబంధిత వార్తలు

OTT | సడెన్‌గా ఓటీటీలోకి వచ్చిన నాగశౌర్య డిజాస్టర్ మూవీ
మే 15, 2026

Action OTT | 40 కోట్ల బడ్జెట్ – ఐదు కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి వచ్చిన తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ – తెలుగులో స్ట్రీమింగ్
మే 14, 2026

OTT | తండ్రికి ఎదురుతిరిగిన సోనాక్షి – డైరెక్ట్‌గా ఓటీటీలోకి జ్యోతిక బాలీవుడ్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ మూవీ
మే 12, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



