Raashii Khanna | ధర్మన్ అప్‌డేట్ లీక్ చేసిన రాశీఖన్నా – మూవీ టీమ్ వార్నింగ్‌తో పోస్ట్ డిలీట్
రజనీకాంత్ ధర్మన్‌కు సంబంధించిన ఓ ముఖ్యమైన అప్‌డేట్‌ను రాశీఖన్నా లీక్ చేసింది. ధర్మన్ సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ నటిస్తోన్న విషయాన్ని అనుకోకుండా బయటపెట్టేసింది. మూవీ టీమ్ వార్నింగ్‌తో తాను పెట్టిన పోస్ట్‌ను డిలీట్ చేసింది.
Entertainment | Published On Sep 29, 2026, 6.12 pm IST
Raashii Khanna | రజనీకాంత్ ధర్మన్ సినిమాకు సంబంధించిన ఓ ముఖ్యమైన అప్‌డేట్‌ను హీరోయిన్ రాశీఖన్నా లీక్ చేసింది. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ కీలక పాత్రలో నటిస్తోన్న విషయాన్ని అనుకోకుండా బయటపెట్టేసింది. మూవీ టీమ్ వార్నింగ్‌తో తన తప్పును గుర్తించిన రాశీఖన్నా పోస్ట్‌ను డిలీట్ చేసింది. కానీ అప్పటికే రాశీఖన్నా పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రజనీకాంత్...కమల్ హాసన్...
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అగ్ర నటుడు కమల్‌హాసన్ నిర్మాణంలో తమిళంలో రూపొందుతోన్న మూవీ ధర్మన్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తోన్నారు. దాదాపు నలభై ఏళ్ల గ్యాప్ తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
రాశీఖన్నా...
ఈ పాన్ ఇండియన్ మూవీలో సిమ్రాన్‌తో పాటు రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధర్మన్ సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ అల్లుడిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో రామ్ కనిపించనున్నట్లు సమాచారం. అయితే మేకర్స్ మాత్రం ఇప్పటివరకు అఫీషియల్‌గా రామ్ ఈ సినిమాలో నటిస్తున్న విషయాన్ని వెల్లడించలేదు.
అనుకోకుండా లీక్...
అనుకోకుండా ధర్మన్‌లో రామ్ నటిస్తోన్న విషయాన్ని రాశీఖన్నా లీక్ చేసింది. ప్రస్తుతం ధర్మన్ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో రజనీకాంత్, రామ్‌తో పాటు రాశీఖన్నాలపై దర్శకుడు అశ్వత్ మారిముత్తు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రజనీకాంత్, రామ్‌లతో కలిసి దిగిన ఓ ఫొటోను రాశీఖన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇద్దరు స్టార్లతో ఎర్లీ మార్నింగ్ వర్కవుట్స్ అంటూ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఫొటోతో ధర్మన్‌లో రామ్ నటిస్తున్న విషయం కన్ఫామ్ అయ్యింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆమె పోస్ట్‌పై మేకర్స్ ఫైర్ అయినట్లు సమాచారం.
ప్లాన్ ఫెయిల్...
రామ్ ఈ సినిమాలో నటిస్తోన్న విషయాన్ని స్పెషల్‌గా రివీల్ చేయాలని మేకర్స్ ప్లాన్స్ వేశారు. కానీ రాశీఖన్నా పోస్ట్‌తో అవన్నీ ఫెయిలయ్యాయి. ఈ లీక్‌పై మూవీ టీమ్ రాశీఖన్నాకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. వారి వార్నింగ్‌తో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను రాశీఖన్నా డిలీట్ చేసింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని నెటిజన్లు అంటోన్నారు.
ధర్మన్‌లో అవినీతిపై పోరాటం చేసే డాక్టర్‌గా రజనీకాంత్ కనిపించబోతున్నారు. సుదీర్ఘ కెరీర్‌లో డాక్టర్ పాత్రలో రజనీకాంత్ నటిస్తోన్న తొలి సినిమా ఇది. ఇందులో రజనీకాంత్ కూతురిగా రాశీఖన్నా కనిపించబోతుండగా..ఆమె భర్త పాత్రను రామ్ పోషిస్తున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ధర్మన్ థియేటర్లలోకి రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ – అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ – కన్నడ బ్యూటీకి ఛాన్స్
సెప్టెంబర్ 28, 2026

Kollywood | వెండితెరపైకి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు – హీరోయిన్గా రాజశేఖర్ కూతురు
సెప్టెంబర్ 26, 2026

Web Series | డేటింగ్ యాప్ కల్చర్‌పై రజనీకాంత్ కూతురు రొమాంటిక్ వెబ్‌సిరీస్ – లిప్‌లాక్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ట్రైలర్
సెప్టెంబర్ 26, 2026
తాజావార్తలు
- ●Juturi Keerthi Reddy | ఏదోటి మాట్లాడి హైలైట్ అవుదామనుకుంటున్నరేమో
- ●Tummala Nageswara Rao | ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో వృద్ధి
- ●Cabinet meeting | అక్టోబర్ 1న కేబినెట్ సమావేశం
- ●Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..
- ●Bullet Train Steel Bridge Maharashtra | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో చారిత్రక ఘట్టం: మహారాష్ట్రలో తొలి స్టీల్ బ్రిడ్జ్.. 1300 కి.మీ ప్రయాణించి వచ్చిన భారీ వంతెన
- ●Konda Surekha | మీకు మొగోళ్లవసరంలే.. ఆడోళ్లతోనే చిత్తు చిత్తు కొట్టిస్తా

Juturi Keerthi Reddy | ఏదోటి మాట్లాడి హైలైట్ అవుదామనుకుంటున్నరేమో

Tummala Nageswara Rao | ఖరీఫ్‌లో పప్పుధాన్యాల సాగులో వృద్ధి

Cabinet meeting | అక్టోబర్ 1న కేబినెట్ సమావేశం

Special Trains | దసరా, దీపావళి పండుగల రద్దీ.. చర్లపల్లి నుంచి దానాపూర్, బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు..



