Nayan Sarika | తెలుగులో నయన్‌కు మరో క్రేజీ ఛాన్స్ – సౌండ్ ఇంజినీర్‌లో నాయికగా…
రాకాస బ్యూటీ నయన్ సారిక తెలుగులో మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు సమాచారం. నారా రోహిత్ హీరోగా తెలుగులో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ తెరకెక్కుతోంది. సౌండ్ ఇంజినీర్ అనే టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On May 8, 2026, 4.27 pm IST
Nayan Sarika | సాధారణంగా కొత్త హీరోయిన్లు గ్లామర్ రోల్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. అందాల ప్రదర్శనతో కూడిన పాత్రలతో ఆడియెన్స్‌ను మెప్పించాలని తాపత్రయపడుతుంటాడు. కానీ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నయన్ సారిక మాత్రం గ్లామర్ రోల్స్‌కు దూరంగా ఉంటోంది. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న సినిమాలతో విజయాలను అందుకోవచ్చని నిరూపిస్తోంది. తెలుగులో ఆయ్, కతో పాటు ఇటీవల రిలీజైన రాకాస సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది.
క్రేజీ ఆఫర్...
రాకాస బ్లాక్‌బస్టర్ తర్వాత తెలుగులో ఈ బ్యూటీ మరో క్రేజీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. గత ఏడాది రిలీజైన సుందరకాండ తర్వాత నారా రోహిత్ తెలుగులో మరో రొమాంటిక్ కామెడీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిఫరెంట్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులో నారా రోహిత్ సరసన నయన్ సారిక హీరోయిన్‌గా నటించనుందట. సౌండ్ ఇంజినీర్‌లోనూ నయన్ నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం.
అఫీషియల్‌గా అనౌన్స్...
సౌండ్ ఇంజినీర్ మూవీకి కని కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. భరత్ చౌదరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. త్వరలో సౌండ్ ఇంజినీర్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.
గ్యాప్ తర్వాత...
ఒకప్పడు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నారా రోహిత్ 2018 తర్వాత సినిమాలకు దూరమయ్యారు. దాదాపు ఆరేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ప్రతినిధి 2 మూవీతో 2024లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. గత ఏడాది సుందరకాండ సినిమా చేశాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



