త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Director Atlee | మ‌రోసారి తండ్రైన కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌

రాకా మూవీ డైరెక్ట‌ర్ అట్లీ రెండోసారి తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందాడు. అట్లీ భార్య ప్రియ సోమ‌వారం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు అట్లీ.

N

Entertainment | Published On Apr 20, 2026, 11.44 am IST

Director Atlee | మ‌రోసారి తండ్రైన కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్‌
Advertisement

Director Atlee కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ మ‌రోసారి తండ్ర‌య్యారు. అట్లీ భార్య ప్రియ సోమ‌వారం పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను సోష‌ల్ మీడియా ద్వారా అట్లీ అభిమానుల‌తో పంచుకున్నారు. అట్లీ, ప్రియ దంప‌తుల‌కు 2023లో కొడుకు మీర్ జ‌న్మించాడు. మీర్‌కు చెల్లెలు పుట్టింది అంటూ ఓ కార్టూన్‌తో కూడిన ఫొటోను అట్లీ సోమ‌వారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఫీలింగ్ బ్లెస్‌డ్ అంటూ పేర్కొన్నారు. అట్లీ, ప్రియ జంట‌కు సినీ ప్ర‌ముఖుల‌తో పాటు ఫ్యాన్స్ శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

అల్లు అర్జున్‌తో రాకా....

ప్ర‌స్తుతం రాకా సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు అట్లీ. అల్లు అర్జున్ హీరోగా సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేశారు. ఇందులో విచిత్ర‌మైన గెట‌ప్‌లో అల్లు అర్జున్ క‌నిపించ‌డం అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. దాదాపు 1300 కోట్ల బ‌డ్జెట్‌తో కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

దీపికా ప‌దుకొనే హీరోయిన్‌...

రాకా సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తోంది. పుష్ప 2 బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్ర‌స్తుతం ముంబాయిలో షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. వ‌చ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తోన్న 22వ సినిమా ఇది.

 

Advertisement
Advertisement