Vijay Deverakonda | రష్మికపై కొండంత ప్రేమను చాటుకున్న విజయ్ – పెళ్లైనా తగ్గేదేలే
భార్య రష్మిక మందన్నపై తనకున్న ప్రేమను విజయ్ చాటుకున్నాడు. మెడల్ ఆర్ అనే అక్షరంలో కూడిన లాకెట్ ధరించి కనిపించాడు. అర్ అంటే రష్మిక అని నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. పెళ్లైనా భార్య రష్మికపై విజయ్‌కి ఉన్న ప్రేమ తగ్గలేదని అంటున్నారు.
Entertainment | Published On May 28, 2026, 4.10 pm IST
Vijay Deverakonda | టాలీవుడ్ లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఈ ఏడాది ఫిబ్రవరిలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు పది రోజుల పాటు ఈ జంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిసిన వెంటనే విజయ్, రష్మిక సినిమాలతో బిజీ అయ్యారు.
మూడో సినిమా ఇది...
ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్‌లో తెలుగులో రణబాలి సినిమా తెరకెక్కుతోంది. హిస్టారికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్, రష్మిక కాంబినేషన్‌లో వస్తోన్న మూడో మూవీ ఇది.
యానిమే అవార్డ్స్...
ఇటీవల జపాన్‌లోని టోక్యోలో జరిగిన వరల్డ్ యానిమే అవార్డ్స్ ఈవెంట్‌కు ఓ చీఫ్ గెస్ట్‌గా రష్మిక మందన్న అటెండ్ అయ్యింది. ఈ వేడుక కోసం భర్త విజయ్ దేవరకొండతో కలిసి జపాన్ వెళ్లింది రష్మిక. ఈ వేడుకలో హాలీవుడ్ నటుడు విన్‌స్టన్ డ్యూక్‌తో కలిసి అవార్డ్ ప్రజెంటర్‌గా వ్యవహరించింది.
ఆర్ ఆక్షరం...
యానిమే అవార్డ్స్ ఈవెంట్‌ను ముగించుకొని విజయ్, రష్మిక బుధవారం ఇండియాకు వచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్టైలిష్‌గా అభిమానులను కనిపించారు. వైట్ షర్ట్, డెనిమ్ జీన్స్ ధరించి రష్మిక మోడ్రన్ లుక్‌లో మెరిసింది. కాగా విజయ్ మెడలోని లాకెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మెడలో పొడవాటి గోల్డ్ చైన్ ధరించి విజయ్ కనిపించారు. ఈ చైన్‌కు ఆర్ అనే అక్షరంతో కూడిన లాకెట్ ఉంది. ఆర్ అంటే రష్మిక అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. లాకెట్‌తో భార్య రష్మికపై తనకున్న ప్రేమను విజయ్ చాటుకున్నాడని అంటున్నారు. పెళ్లైనా భార్యపై విజయ్‌కి ఉన్న ప్రేమ తగ్గలేదని అంటున్నారు.
కాక్ టెయిల్ 2...
ప్రస్తుతం తెలుగులో రణబాలి, మైసాతో పాటు బాలీవుడ్‌లో కాక్ టెయిల్ 2 సినిమాలు చేస్తోంది రష్మిక మందన్న. ఈ మూడు సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరోవైపు విజయ్ కూడా రణబాలితో పాటు రౌడీ జనార్ధన షూటింగ్‌లతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్షన్‌లో ఓ మైథలాజికల్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shamita Shetty | 47 ఏళ్లు దాటినా ఇంకా సింగిలేనా? – బాడీ షేమింగ్ కామెంట్లపై హీరోయిన్ ఫైర్
మే 28, 2026

Suriya | సూర్య స్ట్రెయిట్ తెలుగు మూవీపై క్రేజీ అప్డేట్ – విశ్వనాథ్ అండ్ సన్స్ రిలీజ్ డేట్ ఫిక్స్
మే 28, 2026

Yellamma Movie | ఎల్లమ్మ కు హీరోయిన్ దొరికేదెప్పుడో? – తెరపైకి మలయాళ బ్యూటీ పేరు!
మే 28, 2026
తాజావార్తలు
- ●BJP New State Presidents | బీజేపీలో భారీ ప్రక్షాళన: ఢిల్లీ, పంజాబ్ సహా నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు.. పూర్తి లిస్ట్ ఇదే
- ●Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే అప్డేట్ చేయకపోతే హ్యాకింగ్ ముప్పు..
- ●Pregnant Woman | 22 ఏళ్లకే ఆరోసారి గర్భందాల్చిన మహిళ.. ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్
- ●Shamita Shetty | 47 ఏళ్లు దాటినా ఇంకా సింగిలేనా? - బాడీ షేమింగ్ కామెంట్లపై హీరోయిన్ ఫైర్
- ●Bank Of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా యూపీఐ యాప్‌లో భారీ అప్డేట్.. ఫేస్ వెరిఫికేషన్‌తో పేమెంట్లు చేయవచ్చు..
- ●Kanchi Varadaraja Swamy Temple | కంచి వరదరాజస్వామి బ్రహ్మోత్సవాలు: ఆ 'గరుడ సేవ'ను ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. పునర్జన్మ ఉండదట!

BJP New State Presidents | బీజేపీలో భారీ ప్రక్షాళన: ఢిల్లీ, పంజాబ్ సహా నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులు.. పూర్తి లిస్ట్ ఇదే

Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు హెచ్చరిక.. వెంటనే అప్డేట్ చేయకపోతే హ్యాకింగ్ ముప్పు..

Pregnant Woman | 22 ఏళ్లకే ఆరోసారి గర్భందాల్చిన మహిళ.. ఆందోళన వ్యక్తం చేసిన డాక్టర్

Shamita Shetty | 47 ఏళ్లు దాటినా ఇంకా సింగిలేనా? - బాడీ షేమింగ్ కామెంట్లపై హీరోయిన్ ఫైర్



