Disha Patani | హాలీవుడ్‌లోకి ప్రభాస్ హీరోయిన్ ఎంట్రీ – ఆస్కార్ విన్నర్ సినిమాలో ఛాన్స్…
ప్రభాస్ కల్కి హీరోయిన్ దిశా పటానీ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీ డైరెక్షన్‌లో ఓ యాక్షన్ మూవీ చేస్తోంది. ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On May 10, 2026, 10.15 am IST
Disha Patani |ప్రభాస్ కల్కి హీరోయిన్ దిశా పటానీ హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఆస్కార్ విన్నర్‌తో సినిమా చేస్తోంది. దిశా పటానీ యాక్టింగ్ జర్నీ తెలుగు సినిమాలతోనే మొదలైంది. వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన లోఫర్ మూవీతో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. సల్మాన్ ఖాన్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహం వంటి టాప్ హీరోలతో హిందీలో సినిమాలు చేసింది.
ప్రభాస్ ప్రియురాలిగా...
కల్కి 2898 ఏడీ మూవీలో ప్రభాస్ ప్రేయసిగా గ్లామర్ రోల్‌లో అదరగొట్టిన ఈ బ్యూటీ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఆస్కార్ విన్నింగ్ యాక్టర్ కెవిన్ స్పేసీ డైరెక్షన్‌లో ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ పేరుతో ఓ సూపర్ నాచురల్ హారర్ యాక్షన్ మూవీ తెరకెక్కుతోంది.
యోధురాలిగా...
ఈ హారర్ సినిమాలో కెవిన్ స్సేసీ, టైరీస్ గిబ్సన్, డాల్ఫ్ లాండ్‌గ్రేన్ తో పాటు పలువురు హాలీవుడ్ దిగ్గజ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో దిశా పటానీ ఓ హీరోయిన్‌గా నటించబోతుంది. జెస్సీకా అనే క్యారెక్టర్‌లో కనిపించబోతుంది. ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టాటిగార్డ్స్, హోలి గార్డ్స్ అనే రెండు వర్గాల మధ్య పోరుతో ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. యాక్షన్ సన్నివేశాలు, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్‌లో సూపర్ పవర్స్ కలిగిన యువతిగా దిశా పటానీ రోల్ సర్‌ప్రైజింగ్‌గా సాగింది. . స్టాటిగార్డ్స్, హోలి గార్డ్స్ ను కలిపేందుకు ప్రయత్నించే యోధురాలిగా దిశా పటానీ కనిపించనున్నట్లు సమాచారం.
ఆస్కార్ అవార్డులు...
ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్‌తో దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత కెవిన్ స్సేసీ మెగా ఫోన్ పడుతున్నారు. అమెరికన్ బ్యూటీతో పాటు ది యూజువల్ సస్పెక్స్ట్ సినిమాలకు గాను ఆస్కార్ అవార్డులను అందుకున్నారు కెవిన్ స్పేసీ.
హిందీలో...
ప్రస్తుతం హిందీలో వెల్‌కమ్ టూ ది జంగిల్‌తో పాటు అవారాపన్ 2 సినిమాలు చేస్తోంది దిశా పటానీ. ప్రభాస్ కల్కి 2లో నటిస్తోంది. కల్కి పార్ట్ వన్‌తో పోలిస్తే సీక్వెల్‌లో ఆమె పాత్ర నిడివితో పాటు ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



