Disha Patani | అవును… ప్రేమలో ఉన్నా – దిశా పటానీతో డేటింగ్‌పై బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్
పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్‌తో దిశా పటానీ డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రేమ పుకార్లపై తల్విందర్ సింగ్ రియాక్ట్ అయ్యాడు. తాను ప్రేమలో ఉన్నానని చెప్పాడు. ఈ సింగర్ కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Feb 5, 2026, 6.37 pm IST
Disha Patani | బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కొద్ది రోజులుగా సినిమాల కంటే డేటింగ్ రూమర్స్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. పంజాబీ సింగర్ తల్విందర్ సింగ్‌తో దిశా పటానీ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినట్లు బాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు తమ లవ్‌స్టోరీని ఈ జంట సీక్రెట్‌గా దాచిపెట్టారు. కానీ కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ వివాహ వేడుకతో వీరి రహస్య ప్రేమాయణం బట్టబయలైంది.
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్...
నుపుర్ సనన్ పెళ్లి వేడుకకు తల్విందర్, దిశా పటానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. కలిసే వివాహానికి అటెండ్ అయ్యారు. తిరిగి జంటగానే ముంబై వెళ్లిపోయారు. వీరిద్దరు చెట్టపట్టాలేసుకొని తిరిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. అప్పటి నుంచి తరచుగా ఈ జంట మీడియా కంట పడుతూనే ఉన్నారు. బుధవారం ముంబైలోని మౌంట్ మేరీ చర్చ్‌కు బాయ్‌ఫ్రెండ్ తల్విందర్‌తోనే దిశా పటానీ వచ్చింది.
అంతకుమించి....
దిశాతో డేటింగ్‌పై ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తల్విందర్ రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం తాను ప్రేమలోనే ఉన్నానని అన్నాడు. "నుపుర్ సనన్ పెళ్లి నుంచే మేము ఒకరినొకరం తెలుసుకోవడం ప్రారంభించాం. ప్రస్తుతం మమ్మల్ని మేము అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. అంతకుమించి ఏం చెప్పలేను" అని అన్నారు.
అనుకోకుండా అందరి దృష్టి మాపై పడిందని, ఈ పుకార్లను మేము ప్రెషర్‌లా ఫీలవ్వడం లేదని తల్విందర్ అన్నాడు. మా రిలేషన్ గురించి వస్తోన్న రూమర్లను పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పాడు ." ప్రస్తుతానికి నేను లవ్‌లోనే ఉన్నా ప్రతిరోజు ప్రేమలో పడుతూనే ఉన్నా. ఈ భావనలో ఆస్వాదిస్తున్నా" అని తల్విందర్ చెప్పాడు. అతడి కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. ఇన్‌డైరెక్ట్‌గా దిశా పటానీతో ప్రేమలో ఉన్న సంగతిని తల్విందర్ బయటపెట్టాడని అంటున్నారు.
లోఫర్ తో ఎంట్రీ....
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన తెలుగు మూవీ లోఫర్‌తో దిశా పటానీ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. ఆ తర్వాత బాలీవుడ్‌కు షిప్టయ్యింది. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రభాస్ కల్కితో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హిందీలో అవారాపన్ 2, వెల్‌కమ్ టు ది జంగిల్ సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తోంది. షాహిద్ కపూర్ ఓ రోమియోలో గెస్ట్ రోల్ చేసింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



