OTT | రాజ్ తరుణ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పాంచ్ మినార్ మరో ఓటీటీలోకి వచ్చింది. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆహా ఓటీటీలో రిలీజైంది. పాంచ్ మినార్ మూవీకి రామ్ కుడుముల దర్శకత్వం వహించాడు. ఇందులో రాజ్ తరుణ్ కు జోడీగా రాశీసింగ్ హీరోయిన్‌గా నటించింది. నవంబర్ మూడో వారంలో థియేటర్లలో రిలీజైన పాంచ్ మినార్ వారం రోజుల గ్యాప్‌లోనే అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రావడం అప్పట్లో టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో ఫెయిల్యూర్‌గా నిలిచిన పాంచ్ మినార్ అమెజాన్ ప్రైమ్‌లో మాత్రం టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ చేసిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా పాంచ్ మినార్‌కు పేరొచ్చిన కమర్షియల్‌గా మాత్రం సరైన వసూళ్లను రాలేదు. పాంచ్ మినార్‌లో అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రల్లో న టించారు. పాంచ్ మినార్ కథ ఇదే... కృష్ణచైతన్య అలియాస్ కిట్టు (రాజ్ తరుణ్) ఓ క్యాబ్ డ్రైవర్. ప్రియురాలు ఖ్యాతికి (రాశీసింగ్) మాత్రం సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నానని అబద్ధం చెబుతాడు. చోటు అనే గ్యాంగ్‌స్టర్‌ను హత్య చేసిన ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లు కిట్టు క్యాబ్ ఎక్కుతారు. వారి వద్ద ఉన్న ఐదు కోట్ల డబ్బును తెలివిగా కిట్టు కొట్టేస్తాడు. ఆ డబ్బు కిట్టును ఎలా కష్టాల్లోకి నెట్టింది? కిట్టును చంపాలని పోలీస్ ఆఫీసర్ ఎందుకు ప్రయత్నించాడు? కిట్టు జాబ్ గురించి ప్రియురాలు ఖ్యాతికి నిజం తెలిసిందా అనే కాన్సెప్ట్‌తో పాంచ్ మినార్ మూవీ రూపొందింది. గత కొన్నాళ్లుగా సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా రాజ్ తరుణ్ బ్యాడ్‌టైమ్ నడుస్తోంది. రాజ్ తరుణ్ ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని లావణ్య అనే యువతి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ వివాదం కారణంగా గత ఏడాది ఎక్కువగా వార్తల్లో నిలిచారు రాజ్‌తరుణ్. డిజాస్టర్స్, వ్యక్తిగత జీవితంలోని సమస్యలతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు.