త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Krithi Shetty | కృతి శెట్టి కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య‌ గొడ‌వ‌ – బాలీవుడ్ డెబ్యూ మూవీకి కొత్త క‌ష్టాలు

కృతిశెట్టి బాలీవుడ్ డెబ్యూ మూవీ షూటింగ్ మొద‌లుకాక‌ముందే చిక్కుల్లో ప‌డింది. కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకునే విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు వ‌చ్చాయ‌ట‌. ఈ గొడ‌వ‌ల వ‌ల్ల డైరెక్ట‌ర్ మిలాప్ జ‌వేరీ ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Feb 3, 2026, 12.12 pm IST

Krithi Shetty | కృతి శెట్టి కోసం ద‌ర్శ‌క‌నిర్మాత‌ల మ‌ధ్య‌ గొడ‌వ‌ – బాలీవుడ్ డెబ్యూ మూవీకి కొత్త క‌ష్టాలు
Advertisement

Krithi Shetty | ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ద‌క్షిణాది భామ‌ల హ‌వా కొన‌సాగుతోంది. సాయిప‌ల్ల‌వి, కీర్తి సురేష్‌తో పాటు ప‌లువురు సౌత్ హీరోయిన్లు క్రేజీ ఆఫ‌ర్ల‌ను సొంతం చేసుకుంటున్నారు. స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తున్నారు. వీరి బాట‌లోనే ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి అడుగులు వేయాల‌ని ఫిక్స‌య్యింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో ఇప్ప‌టికే టాలీవుడ్‌కు దూర‌మైంది. త‌మిళంలో బోలెడు ఆశ‌లు పెట్టుక‌న్న వా వాథియార్ థియేట‌ర్ల‌లో ప‌ట్టుమ‌ని రెండు రోజులు కూడా నిల‌బ‌డ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం కృతి శెట్టి చేతిలో ఒకే ఒక త‌మిళ మూవీ ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ మాత్ర‌మే ఉంది.

బాలీవుడ్‌లోకి ఎంట్రీ....

ద‌క్షిణాదిలో పూర్తిగా అవ‌కాశాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌క‌ముందే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ప్లాన్ చేసింది కృతి శెట్టి. అనుకున్న‌ట్లుగానే ఓ భారీ బ‌డ్జెట్ సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకుంది. టైగ‌ర్ ష్రాఫ్ హీరోగా మిలాప్ జ‌వేరీ ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ సినిమాను అనౌన్స్‌చేసింది. ఈ మూవీలో కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాల‌ని ప్రొడ‌క్ష‌న్ హౌజ్ అనుకుంద‌ట‌. ఆడిష‌న్ కూడా చేయ‌డ‌మే కాకుండా ఆమె పేరును ఫైన‌ల్ చేసేశార‌ట‌. ద‌ర్శ‌కుడు మాత్రం కృతిశెట్టి హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి సుముఖత చూప‌లేద‌ట‌. కృతిశెట్టిని కాద‌ని త‌న‌కు కావాల్సిన మ‌రో బాలీవుడ్ హీరోయిన్ పేరును రిక‌మండ్ చేసిన‌ట్లు తెలిసింది. హీరోయిన్ విష‌యంలో నిర్మాత‌కు, ద‌ర్శ‌కుడికి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు మొద‌లైన‌ట్లు బాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది.

మిలాజ్ జ‌వేరీ ఔట్‌...

కృతిశెట్టి విష‌యంలో మిలాప్ జ‌వేరీ ప‌ట్టువీడ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు టీ సిరీస్ సంస్థ ఈ సినిమా నుంచి అత‌డినే ప‌క్క‌న‌పెట్టిన‌ట్లు తెలిసింది. మిలాప్ జ‌వేరీ స్థానంలో మ‌రో కొత్త ద‌ర్శ‌కుడితో ఈ సినిమాను తెర‌కెక్కించాల‌ని భావిస్తుంద‌ట‌. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ కోసం అన్వేషణ సాగుతోన్న‌ట్లు స‌మాచారం.

అస‌లే ఫ్లాప్‌ల‌తో కెరీర్ ప‌రంగా క‌ష్టాల్లో ఉంది కృతిశెట్టి. వాటికి తోడు బాలీవుడ్ డెబ్యూ మూవీ సెట్స్‌పైకి రాక‌ముందే వివాదాల్లో చిక్కుకోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కొత్త ద‌ర్శ‌కుడు దొరుకుతాడా? అస‌లు కృతిశెట్టి బాలీవుడ్ మూవీ షూటింగ్ స‌క్ర‌మంగా జ‌రుగుతుందా? అన్న‌ది చూడాల్సిందే.

 

Advertisement
Advertisement