త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Priyanka Chopra | వార‌ణాసి కంటే ముందు ప్రియాంక చోప్రా చేసిన తెలుగు మూవీ ఇదే – 2002లో రిలీజ్ కావాల్సింది కానీ….

వార‌ణాసి కంటే ముందు తెలుగులో ప్రియాంక చోప్రా ఓ సినిమా చేసింది. ట్రాయాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాతోనే గ్లోబ‌ల్ స్టార్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ సినిమా ఆగిపోయింది.

N

Entertainment | Published On Mar 22, 2026, 3.31 pm IST

Priyanka Chopra | వార‌ణాసి కంటే ముందు ప్రియాంక చోప్రా చేసిన తెలుగు మూవీ ఇదే – 2002లో రిలీజ్ కావాల్సింది కానీ….
Advertisement

Priyanka Chopra | మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న వార‌ణాసి మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి తొలి అడుగు వేయ‌బోతున్న‌ది గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా. ఇందులో మందాకిని అనే యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. పెళ్లి త‌ర్వాత బాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చి హాలీవుడ్‌కు షిప్ట‌యిన ప్రియాంక చోప్రా...వార‌ణాసితోనే తిరిగి ఇండియ‌న్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

హాలీవుడ్‌కు త‌గ్గ‌కుండా...

పురాణాల నేప‌థ్యంలో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాపై వ‌ర‌ల్డ్ వైడ్‌గా బ‌జ్ నెల‌కొంది. టెక్నిక‌ల్‌, స్టోరీ ప‌రంగా హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు.

మ‌హేష్‌కు జోడీగా...

కాగా వార‌ణాసిలో ప్రియాంక చోప్రా పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాలో మ‌హేష్‌బాబుకు జోడీగా న‌టిస్తుందా? వీరిద్ద‌రి కెమిస్ట్రీ ఎలా ఉండ‌బోతుంద‌నే విష‌యంలో మాత్రం రాజ‌మౌళి స‌స్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు.

2002లో...

కాగా వార‌ణాసి ప్రియాంక చోప్రా డెబ్యూ తెలుగు మూవీ కాదు. 2002లో వ‌చ్చిన ద‌ళ‌ప‌తి విజ‌య్ తామిజ‌న్ మూవీతో ప్రియాంక చోప్రా యాక్టింగ్ జ‌ర్నీ మొద‌లైంది. అదే ఏడాది తెలుగులో అపురూపం పేరుతో ఓ సినిమాను అంగీక‌రించింది. ట్రాయాంగిల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు జీఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మ‌ధుక‌ర్‌, ప్ర‌స‌న్న హీరోలుగా న‌టించారు.
అపురూపం ప్ర‌మోష‌న్స్ చేశారు. కొన్ని పాట‌లు రిలీజ్ చేశారు. షూటింగ్ తుది ద‌శ‌లో ఉండ‌గా ఆర్థిక కార‌ణాల వ‌ల్ల సినిమా ఆగిపోయింది. కొన్నాళ్ల త‌ర్వాత మిగిలిన షూటింగ్‌ను కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ చాలానే ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా బిజీగా మార‌డంతో డేట్స్ అడ్జెస్ట్ చేయ‌డం క‌ష్టంగా మారింది. దాంతో అపురూపం రిలీజ్‌కు నోచుకోలేదు.
తొలి సినిమా ఆగిపోయిన 24 ఏళ్ల త‌ర్వాత వార‌ణాసితో టాలీవుడ్‌లోకి ప్రియాంక ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. వార‌ణాసి మూవీ 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతుంది. . ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ కీర‌వాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. దాదాపు 1500 కోట్ల బ‌డ్జెట్‌తో వార‌ణాసి తెర‌కెక్కుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement