త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా మూవీ – భార్య కోసం దొంగ‌గా మారిన భ‌ర్త క‌థ‌

ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించిన తెలుగు కామెడీ డ్రామా మూవీ ప్రేమంటే ఓటీటీలోకి రాబోతుంది. డిసెంబ‌ర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రేమంటే మూవీలో సుమ క‌న‌కాల కీల‌క పాత్ర‌లో న‌టించింది.

N

Entertainment | Published On Dec 15, 2025, 12.07 pm IST

OTT | ఓటీటీలోకి తెలుగు కామెడీ డ్రామా మూవీ – భార్య కోసం దొంగ‌గా మారిన భ‌ర్త క‌థ‌

ప్రేమంటే ఓటీటీ రిలీజ్ డేట్

Advertisement

OTT |ప్రియ‌ద‌ర్శి (Priyadarshi), ఆనంది హీరోహీరోయిన్లుగా న‌టించిన లేటెస్ట్ తెలుగు మూవీ ప్రేమంటే ఓటీటీ (Ott) రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో యాంక‌ర్ సుమ క‌న‌కాల కీల‌క పాత్ర పోషించింది. న‌వ‌నీత్ శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
న‌వంబ‌ర్ మూడో వారంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌స్తుంది. డిసెంబ‌ర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల అవుతోంది.
బ‌ల‌గం, కోర్ట్ సినిమాల‌తో విజ‌యాల‌కు అందుకున్న ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టించ‌డం, సుమ క‌న‌కాల గెస్ట్ రోల్ చేయ‌డంతో పాటు హీరో రానా ద‌గ్గుబాటి ప్ర‌జెంట‌ర్ కావ‌డంతో రిలీజ్‌కు ముందు ఈ చిన్న సినిమాపై తెలుగు ఆడియెన్స్‌లో మంచి బ‌జ్ ఏర్ప‌డింది. కాన్సెప్ట్ యూనిక్‌గా ఉన్న థ్రిల్లింగ్‌గా చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డిపోవ‌డంతో ప్రేమంటే ఫెయిల్యూర్‌గా నిలిచింది.
మ‌ధి (ప్రియ‌ద‌ర్శి) సెక్యూరిటీ ఏజెన్సీ ర‌న్ చేస్తుంటారు. ర‌మ్య (ఆనంది) చ‌దువు పూర్తిచేసుకొని ఉద్యోగం చేస్తుంటుంది. పెళ్లి విష‌యంలో ఇద్ద‌రికి ఎన్నో క‌ల‌లు ఉంటాయి. ర‌మ్య‌తో మ‌ధి పెళ్ల‌వుతుంది. పెళ్లి త‌ర్వాతే మ‌ధి దొంగ అనే నిజం బ‌య‌ట‌ప‌డుతుంది. భ‌ర్త గురించి నిజం తెలిసి ర‌మ్య ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది? వారి లైఫ్‌లోకి హెడ్ కానిస్టేబుల్ ఆశ (సుమ క‌న‌కాల) ఎలా ఎంట‌రైంది అన్న‌దే ప్రేమంటే మూవీ క‌థ‌.
ఈ ఏడాది కోర్ట్ మూవీతో హీరోగా పెద్ద విజ‌యాన్ని అందుకున్నాడు ప్రియ‌ద‌ర్శి. కేవ‌లం ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది.
కోర్ట్ త‌ర్వాత సారంగ‌పాణి జాత‌కం, మిత్ర మండ‌లితో పాటు ప్రేమంటే సినిమాలు చేశాడు. ఇవేవీ క‌మ‌ర్షియ‌ల్‌గా విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయాయి.

 

Advertisement

తాజావార్తలు

Advertisement